Home /News /sports /

WOMENS T20 CHALLENGE VEL VS TRL LIVE SCORE UPDATES TRAILBLAZERS WON BY 16 RUNS BUT DID NOT REACH FINAL SRD

VEL vs TBL : స్మృతి మంధాన జట్టుకు తప్పని నిరాశ.. గెలిచినా ఇంటికే.. కిరణ్ ధనాధన్ ఇన్నింగ్స్..

Trailblazers (IPL Twitter)

Trailblazers (IPL Twitter)

VEL vs TRL : ఫైనల్ కి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన చావో రేవో మ్యాచులో ట్రయల్ బ్లేజర్స్ గెలిచింది. కానీ.. ఫైనల్ కు మాత్రం చేరలేకపోయింది. వెలాసిటీ జట్టును 158 పరుగుల్లోపు కట్టడి చేయాల్సి ఉండగా.. ఆ లక్ష్యాన్ని మాత్రం అందుకోలేకపోయింది స్మృతి మంధాన జట్టు.

ఇంకా చదవండి ...
    మహిళల టీ20 ఛాలెంజర్స్ టోర్నీలో ఫైనలిస్టులు ఎవరో తేలిపోయింది. సూపర్ నోవాస్ తో వెలాసిటీ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్ కి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన చావో రేవో మ్యాచులో ట్రయల్ బ్లేజర్స్ గెలిచింది. కానీ.. ఫైనల్ కు మాత్రం చేరలేకపోయింది. వెలాసిటీ జట్టును 158 పరుగుల్లోపు కట్టడి చేయాల్సి ఉండగా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది స్మృతి మంధాన జట్టు. 191 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెలాసిటీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. దీంతో.. 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ.. మెరుగైన రన్ రేట్ తో ఫైనల్ కి చేరింది. అయితే.. వెలాసిటీ ఇన్నింగ్స్ కిరణ్ నవ్ గిరే ధనాధన్ ఇన్నింగ్స్ తో ట్రయల్ బ్లేజర్స్ బౌలర్లకు చుక్కలు చూపింది. ఈ అమ్మాయి (34 బంతుల్లో 69 పరుగులు ; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించింది. ట్రయల్ బ్లేజర్స్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ రెండు వికెట్లతో సత్తా చాటారు.

    రేణుకా, మాథ్యూస్, సల్మా ఖాతున్, సోఫియా డంక్లీ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. ఈ ఓటమితో స్మృతి మంధాన జట్టు టోర్ని నుంచి నిష్క్రమించింది.191 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన వెలాసిటీ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. షెఫాలీ వర్మ, యస్తికా భాటియా ధనాధన్ బ్యాటింగ్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడికి సల్మా కాతూన్ బ్రేకులు వేసింది.


    19 పరుగులు చేసిన యస్తికా క్లీన్ బౌల్డ్ అయింది. మొదటి వికెట్ కోల్పోయినప్పటికీ.. షెఫాలీ తన దూకుడు ఆపలేదు. బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. అయితే.. 29 పరుగులు చేసిన షెఫాలీను రాజేశ్వరి గైక్వాడ్ పెవిలియన్ కు పంపింది. దీంతో.. 50 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది వెలాసిటీ. అయితే.. వన్ డౌన్ లో వచ్చిన కిరణ్ నవ్ గిరే.. ట్రయల్ బ్లేజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించింది. క్రీజులోకి వచ్చిన దగ్గర నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడింది. కిరణ్ కి సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ లారా వోల్వార్డ్ సహకరించింది. ఈ క్రమంలో ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని పూనమ్ యాదవ్ విడదీసింది.


    17 పరుగులు చేసిన లారా రిచా ఘోష్ కి క్యాచ్ ఇచ్చి ఔటైంది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ దీప్తి శర్మ కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయింది. 2 పరుగులు చేసిన దీప్తి.. రాజేశ్వరి బౌలింగ్ లో ఔటైంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా కిరణ్ నవ్ గిరే తన దూకుడు ఆపలేదు. ఈ క్రమంలో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. మహిళల టీ20 ఛాలెంజర్ టోర్నీలోనే ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.

    అయితే, ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది వెలాసిటీ జట్టు. 11 పరుగులు చేసిన స్నేహ్ రాణా రేణుకా సింగ్ బౌలింగ్ లో స్మృతి కి క్యాచ్ ఇచ్చి ఔటైంది. ఆ తర్వాత 34 బంతుల్లో 69 పరుగులు చేసిన కిరణ్ .. సోఫీ డంక్లే బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో.. 153 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది వెలాసిటీ. అయితే.. 159 పరుగులు చేస్తే చాలు వెలాసిటీ ఫైనల్ కు చేరుతుంది. దీంతో.. ఆ జట్టు ఓడినా ఫైనల్ కి చేరింది.

    అంతకుముందు భారీ స్కోరు సాధించింది ట్రయల్ బ్లేజర్స్. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (47 బంతుల్లో 73 పరుగులు ; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్ (44 బంతుల్లో 66 పరుగులు ; 7 ఫోర్లు, 1 సిక్సర్ ) అద్భుతంగా రాణించారు. ఆఖర్లో మాథ్యూస్ ( 16 బంతుల్లో 27 పరుగులు ; ) డంక్లీ ( 8 బంతుల్లో 19 పరుగులు) మెరుపులు మెరిపించారు. సిమ్రాన్ రెండు వికెట్లతో సత్తా చాటింది. కేట్ క్రాస్, స్నేహ్ రాణా, ఖాఖ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Smriti Mandhana, Women T20 Challenge, Women's Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు