WOMENS T20 CHALLENGE VEL VS TRL LIVE SCORE UPDATES TRAILBLAZERS SETS HUGE TOTAL ON SCORE BOARD AND MEGHANA PLAYS SUPER KNOCK SRD
VEL vs TBL : తెలుగమ్మాయి మేఘన, జెమీమా అదుర్స్.. డూ ఆర్ డై ఫైట్ లో భారీ స్కోరు సాధించిన స్మృతి జట్టు..
Photo Credit : IPL Twitter
VEL vs TRL : ఫైనల్ కి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన చావో రేవో మ్యాచులో ట్రయల్ బ్లేజర్స్ అదరగొట్టింది. భారీ స్కోరు సాధించింది. తెలుగమ్మాయి మేఘన, జెమీమా రొడ్రిగ్స్ సూపర్ ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నారు.
పుణె స్టేడియం వేదికగా వెలాసిటీతో జరుగుతున్న మ్యాచులో భారీ స్కోరు సాధించింది ట్రయల్ బ్లేజర్స్. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (47 బంతుల్లో 73 పరుగులు ; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్ (44 బంతుల్లో 66 పరుగులు ; 7 ఫోర్లు, 1 సిక్సర్ ) అద్భుతంగా రాణించారు. ఆఖర్లో మాథ్యూస్ ( 16 బంతుల్లో 27 పరుగులు ; ) డంక్లీ ( 8 బంతుల్లో 19 పరుగులు) మెరుపులు మెరిపించారు. సిమ్రాన్ రెండు వికెట్లతో సత్తా చాటింది. కేట్ క్రాస్, స్నేహ్ రాణా, ఖాఖ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.డూ ఆర్ డై ఫైట్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ట్రయల్ బ్లేజర్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్.. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (1) కేట్ క్రాస్ బౌలింగ్ లో సిమ్రాన్ కి క్యాచ్ ఇచ్చి ఔటైంది. దీంతో.. 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే.. వన్ డౌన్ లో వచ్చిన జెమీమా రొడ్రిగ్స్ తో కలిసిన మరో ఓపెనర్ తెలుగమ్మాయి సబ్బినేని మేఘన సూపర్ షాట్లతో అలరించింది.
వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడింది ఈ జోడి. ముఖ్యంగా తెలుగమ్మాయి మేఘన తగ్గేదే లే అన్నట్టు బౌలర్లపై విరుచుకుపడింది. జెమీమా కూడా శోభనకి సహకరించింది. ఈ క్రమంలో ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 50 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఆ తర్వాత కూడా ఈ జోడి సూపర్ ఆటతో ఆకట్టుకుంది. మేఘన తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. జెమీమా కూడా హాఫ్ సెంచరీతో అలరించింది.
A brilliant 100-run partnership comes up between S Meghana & Jemimah 👏👏
ఇక.. వందపరుగులకు పైగా పార్టనర్ షిప్ నెలకొల్పి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని స్నేహ్ రాణా విడదీసింది. స్నేహ్ బౌలింగ్ లో కేట్ క్రాస్ కి క్యాచ్ ఇచ్చి ఔటైంది మేఘన. తెలుగమ్మాయి 47 బంతుల్లో 73 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా జెమీమా తన దూకుడు ఆపలేదు. మాథ్యూస్ తో కలిసి స్కోరు బోర్డు పరుగుల పెట్టించింది. అయితే.. 66 పరుగుల వద్ద ఖాఖ బౌలింగ్ లో స్నేహ్ రాణాకి క్యాచ్ ఇచ్చి ఔటైంది. ఇక, ఆఖర్లో మాథ్యూస్, డంక్లీ భారీ షాట్లతో మెరుపులు మెరిపించారు. దీంతో.. 190 పరుగుల భారీ స్కోరు సాధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.