మహిళల ఐపీఎల్‌లో తొలి మ్యాచ్... మెరిసిన స్మృతి మందన్నా...

67 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 90 పరుగులు చేసిన స్మృతి మందన్నా... హర్లీన్ డియోల్‌తో కలిసి రెండో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం.... చివరి రెండు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ట్రయల్ బ్లేజర్స్....

67 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 90 పరుగులు చేసిన స్మృతి మందన్నా... హర్లీన్ డియోల్‌తో కలిసి రెండో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం.... చివరి రెండు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ట్రయల్ బ్లేజర్స్....

  • Share this:
భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మందన్నా మహిళల ఐపీఎల్ (టీ20 ఛాలెంజ్)లో తొలి మ్యాచ్‌లో సత్తా చాటింది. 67 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 90 పరుగులు చేసింది. స్మృతి మందన్నా సూపర్ ఇన్నింగ్స్ కారణంగా ఆమె జట్టు ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 140 పరుగుల స్కోరు చేయగలిగింది. సుజీ బేట్స్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరినా, హర్లీన్ డియోల్‌తో కలిసి రెండో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది స్మృతి మందన్న. ఇందులో హర్లీన్ డియోల్ చేసింది కేవలం 36 పరుగులే. పూర్తిగా బౌండరీలతో విరుచుకుపడిన స్మృతి మందన్న... ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ డకౌట్ కాగా... స్టఫైన్ టేలర్ 2 పరుగులు చేసి రనౌట్ అయ్యింది. చివరి రెండు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన 10 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత స్టార్ బౌలర్ రాధా యాదవ్‌కు రెండు వికెట్లు దక్కగా, అనుజా పాటిల్, సొఫైన్ డివైన్‌లకు చెరో వికెట్ దక్కాయి.

ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ మధ్య జరుగుతున్న మొదటి టీ20 ఐపీఎల్ మ్యాచ్‌ చూడడానికి జనం బాగానే వచ్చారు. మరీ పురుషుల ఐపీఎల్ మ్యాచ్ అంత కాకపోయినా ఆడవాళ్ల క్రికెట్‌ను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు జనాలు ఉత్సాహం చూపించడం విశేషం. ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు స్మృతి మంద్నా కెప్టెన్‌గా వ్యవహారిస్తుంటే... భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సూపర్ నోవాస్ టీమ్‌కు సారథ్యం వహిస్తోంది.
First published: