Home /News /sports /

WOMENS T20 CHALLENGE 2020 VELOCITY VS TRAILBLAZERS MITHALI RAJ TEAM SCORES 46 RUNS SK

Velocity vs Trailblazers: ఎకిల్‌స్టోన్ దెబ్బకు వెలాసిటీ విలవిల.. 50లోపే ఆలౌట్

సోఫీ ఎకిల్‌స్టోన్ (Image:IPL)

సోఫీ ఎకిల్‌స్టోన్ (Image:IPL)

Velocity vs Trailblazers: ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. 3.1 ఓవర్లలో కేవలం 9 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసింది.

    Womens T20 Challenge: ఉమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్) టోర్నీ 2020లో ఇవాళ రెండో మ్యాచ్ జరుగుతోది. షార్జా వేదికగా తొలి పోరులో స్మతి మంధన నేతృత్వంలోని ట్రైల్‌బ్లేజర్స్, మిథాలి రాజ్ నేతృత్వంలోని వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి.   టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెలాసిటీ జట్టు 15.1  ఓవర్లలో 47 పరుగులు చేసి ఆలౌటయింది. ట్రైల్ బ్లేజర్స్ బౌలర్ ఎకిల్‌స్టోన్ దెబ్బకు వెలాసిటీ బ్యాటర్స్ విలవిల్లాడారు. ఏడు మంది సింగిల్ డిజిట్ స్కోర్ మాత్రమే చేశారు. ఎవరూ కూడా బాధ్యతాయుత ఇన్సింగ్స్ ఆడలేదు. 10 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయారంటే వెలాసిటీ బ్యాటర్స్ ఎంత దారుణంగా ఆడారో అర్ధం చేసుకోవచ్చు.

    స్టార్ బ్యాట్స్‌ఉమెన్ షఫాలి వర్మ మరోసారి విఫలమైంది.  కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన  సుష్మా వర్మ, లుస్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వెలాసిటీ బ్యాటర్స్‌లో.. డేనియల్ వ్యాట్ 3, మిథాలి రాజ్ 1, వేద క్రిష్ణమూర్తి 0, సుష్మా వర్మ 1, సూనె లుస్ 4, శిఖా పాండే 10, సుశ్రీ దిబ్యదర్శిని 0, లీహ్ కాస్పిరెక్ 11 నాటౌట్, ఏక్తా బిష్క్ 0, జహానరా ఆలమ్ 1 పరుగులు చేశారు.

    ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. 3.1 ఓవర్లలో కేవలం 9 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసింది. ఇక జులన్ గోసామి, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మకు ఒక వికెట్ దక్కింది.

    జట్ల వివరాలు:

    Velocity (Playing XI): షఫాలి వర్మ, డేనియల్ వ్యాట్, మిథాలి రాజ్ (కెప్టెన్), వేదా క్రిష్ణమూర్తి, సుష్మా వర్మ (వికెట్ కీపర్), సూనే లూస్, శిఖా పాండే, సుశ్రీ దిమ్యదర్శిణిని, ఏక్తా బిష్త్, లీహ్ కాస్పెరిక్, జహానర ఆలమ్.

    Trailblazers (Playing XI): స్మృతి మంధన (కెప్టెన్), డీండ్రా డాటిన్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హెర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దయాలన్ హేమలత, నట్టకన్ చంతన్, సల్మా ఖుతాన్, సోఫీ ఎకిల్‌స్టోన్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోసామి.

    యూఏఈలోని షార్జాలో మహిళల టీ20 ఛాలెంజ్ మూడో సీజన్ జరుగుతోంది. నవంబరు 4 నుంచి 9 వరకు జరగనున్న టోర్నమెంట్‌లో.. మొత్తం నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో సూపర్‌‌నోవాస్, వెలాసిటీ, ట్రైల్‌బ్లేజర్స్ పాల్గొంటున్నాయి. సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ట్రెయిల్‌ బ్లేజర్స్‌కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్‌ల కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత క్రీడాకారిణులు ఆడుతున్న తొలి టోర్నమెంట్ ఇదే కావడం గమనార్హం. ఈ టోర్నీలో భారత అమ్మాయిలతో పాటు ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌‌తో క్రికెటర్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Trailblazers, Velocity, Women's Cricket, Women’s T20 Challenge 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు