PAK W vs SL W : బంగ్లాదేశ్ (Bangladesh) వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్ (Women's Asia Cup) 2022లో గురువారం థ్రిల్లర్ మ్యాచ్ జరిగిందే. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ మహిళల (Pakistan Women's Team) జట్టుపై శ్రీలంక మహిళల (Sri Lanka Women's Team) జట్టు కేవలం పరుగు తేడాతో నెగ్గింది. 123 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ బిస్మా మారుఫ్ (41 బంతుల్లో 42; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. మరో వెటరన్ ప్లేయర్ నిదా దార్ (26 బంతుల్లో 26; 1 ఫోర్) చివరి బంతికి రనౌట్ గా వెనుదిరిగింది. శ్రీలంక బౌలర్లలో రణవీర 2 వికెట్లతో పాకిస్తాన్ పని పట్టింది.
ఇది కూడా చదవండి : ద్రవిడ్ పక్షపాతానికి ఎంత మంది ప్లేయర్లు బలి కావాలో.. ముద్దుల ప్లేయర్ మళ్లీ విఫలం
చివరి ఓవర్లో పాకిస్తాన్ విజయం కోసం 9 పరుగులు చేయాల్సి ఉంది. తొలి 5 బంతులకు 6 పరుగులు వచ్చాయి. దాంతో ఆఖరి బంతికి గెలవాలంటే 3 పరుగులు చేయాలి. స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న నిదా దార్.. కులసూర్య వేసిన ఫుల్ టాస్ ను ఎక్స్ ట్రా కవర్స్ లో ఆడింది. గాల్లోకి లేచిన బంతి ఫీల్డర్ చేతిలోకి చేరగా.. ఫీల్డర్ క్యాచ్ ను డ్రాప్ చేసింది. వెంటనే బంతిని అందుకున్న ఫీల్డర్ స్ట్రయికింగ్ ఎండ్ వైపు త్రో చేయగా.. బంతిని అందుకున్న వికెట్ కీపర్ దార్ ను రనౌట్ చేసింది. దాంతో పాకిస్తాన్ పరుగు తేడాతో ఓడిపోయింది.
Better luck next time ❤️ Proud of Pakistan ???????? Women ???? cricket team. Well Played ????#PAKvsSL#womensasiacup2022#PAKvsSL pic.twitter.com/uv5rRSruq0
— Shuaib RehmanⓂ️ (@SMRehmaan) October 13, 2022
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 122 పరుగులు చేసింది. హర్షిత సమరవిక్రమ (41 బంతుల్లో 35; 1 ఫోర్) టాప్ స్కోరర్ గా నిలిచింది. అనుష్క సంజీవని (26) ఫర్వాలేదనిపించింది. పాకిస్తాన్ బౌలర్లలో నష్రా సందు 3 వికెట్లు తీసింది. సదియా ఇక్బాల్, నిదా దార్, అన్వర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో భారత అమ్మాయిలు థాయిలాండ్ జట్టును మట్టికరిపించి సగర్వంగా ఫైనల్ లోకి అడుగుపెట్టారు. 149 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన థాయిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 74 పరుగులు మాత్రమే చేసింది. దీంతో.. భారత్ 74 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. థాయిలాండ్ కెప్టెన్ నరుఎమోల్ చైవై (41 బంతుల్లో 21 పరుగులు), నట్టయ బూచతం (29 బంతుల్లో 21 పరుగులు) మాత్రమే రెండంకెల స్కోరు అందుకోగలిగారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీప్తి శర్మ మూడు వికెట్లతో దుమ్మురేపగా.. రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లతో సత్తా చాటింది. ఇదే ఆసియా కప్ లో రోహిత్ సేన లీగ్ స్టేజీలోనే నిష్క్రమించింది. అయితే, అమ్మాయిలు మాత్రం సగర్వంగా ఫైనల్ లోకి దూసుకుపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, India vs srilanka, Pakistan, Smriti Mandhana, Sri Lanka, Team India, Women's Asia Cup