Women's Asia Cup 2022 : మహిళల ఆసియా కప్ (Asia Cup 2022) 2022లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. భారత్ (India), యూఏఈ (UAE) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. యూఏఈ స్పిన్నర్ ఇషా ఓజా మాస్క్ (Esha Oza) పెట్టుకుని బౌలింగ్ చేసింది. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ (IPL)లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) బౌలర్ రిషి ధావన్ (Rishi Dhawan) కూడా మాస్క్ పెట్టుకుని బౌలింగ్ చేశాడు. అయితే బౌలింగ్ చేసే సమయంలో మాత్రమే రిషి ధావన్ మాస్క్ పెట్టుకునే వాడు. కానీ, ఇక్కడ మాత్రం ఇషా.. మ్యాచ్ మొత్తం కూడా మాస్క్ పెట్టుకునే ఆడింది. వాస్తవానికి ఇషాకు కొన్ని రోజుల ముందు ముక్కుపై బంతి బలంగా తాకింది. దాంతో ముక్కు భాగంలో నాలుగు చోట్ల సర్జరీ జరిగింది.
ఆ సర్జరీ నుంచి ఇషా పూర్తిగా కోలుకోలేదు. అయినప్పటికీ ఆసియా కప్ లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమె తన ముక్కుకు మరోసారి ఎటువంటి గాయం కాకుండా ఉండాలనే ఉద్దేశంలో ప్రొటెక్షన్ కోసం మాస్క్ ను వాడింది. ఈ విషయాన్ని మ్యాచ్ మధ్యలో కామెంటేటర్లు పేర్కొన్నారు. ఇక రిషి ధావన్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ కు ముందు జరిగిన దేశవాళి మ్యాచ్ లో ముక్కుకు గాయమైంది. దాంతో అతడు కూడా బౌలింగ్ చేసే ముందు ప్రొటెక్షన్ కోసం మాస్క్ పెట్టుకుని బౌలింగ్ చేశాడు.
*_???? 8.2 Esha Oza To Deepti Sharma No Run ???????? vs ????????_* pic.twitter.com/jRznTvgzhY
— Ahsan khan (@Ahsan23804785) October 4, 2022
Esha Oza and Jemimah Rodrigues have played together for Mumbai before, but today both of them are going to play against each other on an international level, @JemiRodrigues for India and @EshaOza1998 for UAE. #AsiaCup2022 pic.twitter.com/Tv8v2ijkxN
— AKASH (@im_akash196) October 4, 2022
అయితే ఇషా ఒజా గురించి మరో ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే ఇషా ఒజా ముంబైలో జన్మించింది. ఇక దేశవాళి టోర్నీల్లో ఆమె భారత ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ తో కలిసి ముంబై తరఫున ఆడింది. అయితే ఆమె కుంటుంబం యూఏఈ వలస వెళ్లడంతో ఇషా యూఏఈ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేయాల్సి వచ్చింది. దాంతో ఒకప్పుడు సహచరులుగా ఆడిన వీరు ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, Smriti Mandhana, Team India, UAE, Women's Asia Cup