హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs UAE W : టాస్ నెగ్గిన టీమిండియా.. నాలుగు మార్పులతో బరిలోకి.. తుది జట్టు ఇదే

IND W vs UAE W : టాస్ నెగ్గిన టీమిండియా.. నాలుగు మార్పులతో బరిలోకి.. తుది జట్టు ఇదే

PC : BCCI

PC : BCCI

Women's Asia Cup 2022 - IND W vs UAE W : మహిళల ఆసియా కప్ (Asia Cup) 2022లో భారత (India) మహిళల జట్టు బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ లకు సిద్ధమైంది. సోమవారం మలేసియా (Malaysia)తో జరిగిన మ్యాచ్ లో భారత్ 30 పరుగుల తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Women's Asia Cup 2022 - IND W vs UAE W : మహిళల ఆసియా కప్ (Asia Cup) 2022లో భారత (India) మహిళల జట్టు బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ లకు సిద్ధమైంది. సోమవారం మలేసియా (Malaysia)తో జరిగిన మ్యాచ్ లో భారత్ 30 పరుగుల తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం మరో పసికూన జట్టుతో పోరుకు టీమిండియా (Team India) సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్ కు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)కు విశ్రాంతి కల్పించడంతో స్మృతి మంధాన (Smriti Mandhana) కెప్టెన్ గా వ్యవహరించనుంది. టాస్ నెగ్గిన స్మృతి మంధాన బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ మరోసారి భారీగా మార్పులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటు మేఘ్నా సింగ్, షఫాలీ వర్మ, రాధా యాదవ్ లకు విశ్రాంతి ఇచ్చి.. వారి స్థానాల్లో స్మృతి మంధాన,  రేణుక సింగ్, స్నేహ్ రాణా, పూాజా వస్త్రాకర్ లను తుది జట్టులోకి తీసుకుంది.

రొటేషన్ పద్దతి

మహిళల ఆసియా కప్ లో భారత్ రొటేషన్ పద్దతిని ఫాలో అవుతుంది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో కీలక ప్లేయర్లతో ఆడిన భారత్.. మలేసియాతో జరిగిన మ్యాచ్ లో మాత్రం స్మృతి మంధాన, రేణుక సింగ్, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్ లకు రెస్ట్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో ఈ నలుగురు తిరిగి ప్లేయింగ్ ఎలెవన్ లోకి రాగా.. హర్మన్ ప్రీత్ తో పాటు రాధా యాదవ్, మేఘ్నా సింగ్, షఫాలీ వర్మలకు రెస్ట్ ఇచ్చింది. ఇక యూఈఏ ఒక మార్పు చేసింది. లావణ్యను పక్కన బెట్టి ప్రియాంజలిని తుది జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం భారత్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచి 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ తొలి స్థానంల ో ఉంది.

తుది జట్లు

టీమిండియా

స్మృతి మంధాన (కెప్టెన్), సబ్బినేని మేఘన, జెమీమా రోడ్రిగ్స్, హేమలత, రిచా ఘోష్, కిరణ్ నవ్ గిరె, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, దీప్తి శర్మ, రేణుక సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

యూఏఈ

చాయా ముగల్ (కెప్టెన్), థీర్థ సతీశ్, ఇషా ఒజా, కవిశ, నటాషా చెరియత్, ప్రియాంజలి జైన్, ఖుషీ శర్మ, సమైరా దర్నిదార్క, మహిక గౌర్, వైష్ణవె మహేశ్, సురక్ష

First published:

Tags: Bangladesh, India, Smriti Mandhana, Team India, UAE, Women's Asia Cup

ఉత్తమ కథలు