హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs SL W : థర్డ్ అంపైర్ పక్షపాతం.. టీవీ రీప్లేలో చూసి కూడా నాటౌట్ ను అవుట్ గా ప్రకటిస్తావా?

IND W vs SL W : థర్డ్ అంపైర్ పక్షపాతం.. టీవీ రీప్లేలో చూసి కూడా నాటౌట్ ను అవుట్ గా ప్రకటిస్తావా?

PC : TWITTER

PC : TWITTER

IND W vs SL W : బంగ్లాదేశ్ (Bangladesh) వేదికగా మహిళల ఆసియా కప్ (Asia cup) 2022 అక్టోబర్ 1న ఆరంభమైంది. తొలి రోజు శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుతో భారత (India) మహిళల జట్టు తలపడుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND W vs SL W : బంగ్లాదేశ్ (Bangladesh) వేదికగా మహిళల ఆసియా కప్ (Asia cup) 2022 అక్టోబర్ 1న ఆరంభమైంది. తొలి రోజు శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుతో భారత (India) మహిళల జట్టు తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా (Team India) మంచి స్కోరునే సాధించింది. అయితే భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక రనౌట్ విషయంలో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చాడు. 20వ 5వ బంతికి భారత ప్లేయర్  పూాజా వస్త్రాకర్ రెండో పరుగు కోసం ప్రయత్నించింది. అయితే ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న శ్రీలంక వికెట్ కీపర్ వికెట్లను గిరాటేసింది. దాంతో ఫీల్డ్ అంపైర్ రనౌట్ కోసం థర్డ్ అంపైర్ కు నివేదించాడు.

రియల్ టైమ్ లో  పూాజా వస్త్రాకర్ ఈజీగా గ్రౌండ్ కు చేరుకున్నట్లు కనిపించింది. అయితే ఆ తర్వాత రీప్లేలో మాత్రం టైట్ గా కనిపించింది. బంతిని అందుకున్న శ్రీలంక వికెట్ కీపర్ వికెట్లను గిరాటే సమయంలో పూాజా వస్త్రాకర్ బ్యాట్ క్రీజు లోపల కనిపించింది. పలుమార్లు రీప్లే చూసిన థర్డ్ అంపైర్ అవుటంటూ ప్రకటించాడు. అయితే వికెట్లను గిరాటే సమయంలో పూాజా వస్త్రాకర్ బ్యాట్ క్రీజు లోపల ఉంది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై కామెంటేటర్లు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆఖరికి శ్రీలంక ప్లేయర్లు కూడా అది నాటౌట్ అనే భావించారు. అయితే అనూహ్యంగా అవుటని రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత ఆటతీరును కనబరిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) జెమీమాకు చక్కటి సహకారం అందించింది. శ్రీలంక బౌలర్లలో రణసింఘే 3 వికెట్లు తీసింది. చివర్లో హేమలత (13 నాటౌట్), రిచా ఘోష్ (9) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. దాంతో భారత్ ప్రత్యర్థి ముందు మెరుగైన స్కోరునే ఉంచగలిగింది.

లేడీ సెహ్వాగ్ మరోసారి విఫలం

మహిళల క్రికెట్ జట్టులో సెహ్వాగ్ లా ఉన్న షఫాలీ వర్మ (10) తన పూర్ ఫామ్ ను కొనసాగిస్తుంది. ఓపెనర్ గా వచ్చిన ఆమె మరోసారి విఫలం అయ్యింది. ఇక ఫామ్ లో ఉన్న స్మృతి మంధాన (6) కూడా నిరాశ పరిచింది. దాంతో భారత్ 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ లు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డను పరుగెత్తించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 92 పరుగులు జోడించడం విశేషం. అయితే భారీ షాట్ కు ప్రయత్నించిన హర్మన్ ప్రీత్ కౌర్ స్టంపౌట్ అయ్యింది. కాసేపటికే అర్ధ సెంచరీ చేసిన జెమీమా కూడా పెవిలియన్ కు చేరుకుంది. చివర్లో హేమలత, రిచా ఘోష్ లు ధాటిగా బ్యాటింగ్ చేయడంతో భారత్ 150 మార్కును అందుకుంది. ఇప్పటి వరకు ఆసియా కప్ (మహిళల) 7 సార్లు జరగ్గా. .అందులో భారత్ ఏకంగా 6 సార్లు నెగ్గింది. ఒకసారి బంగ్లాదేశ్ చాంపియన్ గా అవతరించింది. అప్పుడు భారత్ పై ఫైనల్ల ో బంగ్లాదేశ్ నెగ్గడం విశేషం.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bangladesh, India vs South Africa, India vs srilanka, Smriti Mandhana, Team India, Women's Asia Cup

ఉత్తమ కథలు