హోమ్ /వార్తలు /క్రీడలు /

Womens Asia cup 2022 : ఆసియా కప్ ఆరంభ పోరులో టాస్ ఓడిన భారత్.. లేడీ సెహ్వాగ్ కు మరో అవకాశం.. తుది జట్లు ఇవే

Womens Asia cup 2022 : ఆసియా కప్ ఆరంభ పోరులో టాస్ ఓడిన భారత్.. లేడీ సెహ్వాగ్ కు మరో అవకాశం.. తుది జట్లు ఇవే

PC : BCCI

PC : BCCI

Womens Asia cup 2022 IND W vs SL W : మహిళల ఆసియా కప్ (Asia cup) 2022 ఆరంభ పోరులో టీమిండియా (Team India) టాస్ ఓడిపోయింది. శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుతో జరిగే తొలి మ్యాచ్ లో భారత్ కెప్టెన్  హర్మన్ ప్రీత్ కౌర్ (Harman Preet Kaur) టాస్ ఓడింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Womens Asia cup 2022 IND W vs SL W : మహిళల ఆసియా కప్ (Asia cup) 2022 ఆరంభ పోరులో టీమిండియా (Team India) టాస్ ఓడిపోయింది. శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుతో జరిగే తొలి మ్యాచ్ లో భారత్ కెప్టెన్  హర్మన్ ప్రీత్ కౌర్ (Harman Preet Kaur) టాస్ ఓడింది. టాస్ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఆసియా కప్ 7 సార్లు జరగ్గా అందులో భారత్ ఏకంగా 6 సార్లు విజేతగా నిలిచింది. మరోసారి రన్నరప్ గా నిలిచింది. ఇక పురుషల ఆసియా కప్ లో శ్రీలంక చాంపియన్ గా నిలిచింది. వారిని స్ఫూర్తిగా తీసుకుని మహిళల ఆసియా కప్ లో కూడా శ్రీలంక గెలవాలనే పట్టుదలగా ఉంది. ఈ మధ్య కాలంలో వరుసగా విఫలం అవుతున్న షఫాలీ వర్మకు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న జెమీమా రోడ్రిగ్స్ మళ్లీ జట్టులోకి వచ్చింది.

మనదే హవా

ఆసియా కప్ లో భారత్ దే  హవా. ఇప్పటి వరకు ఈ టోర్నీ 7 సార్లు జరిగింది. ఇందులో భారత్ ఏకంగా 6 సార్లు నెగ్గడం విశేషం. బంగ్లాదేశ్ ఒకసారి విజేతగా నిలిచింది. 2018లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పై నెగ్గిన బంగ్లాదేశ్ తొలిసారి చాంపియన్ గా నిలిచింది. తొలి మ్యాచ్ లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే టీమిండియాను కూడా కొన్ని సమస్యలు వెంటాడుతోంది. అదే కీలక పోరుల్లో తడపడటం. గ్రూప్ దశలో రాణించినా.. ఫైనల్ పోరులో మాత్రం ఓడిపోతూనే ఉంది. ఇటీవలె ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో కూడా ఫైనల్ చేరిన భారత్.. టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయింది.

షఫాలీ ఫామ్ లోకి వస్తుందా?

టీమిండియా లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ ఈ మధ్య కాలంలో పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడుతుంది. మరో ఓపెనర్ స్మృతి మంధాన మాదిరి భారీ ఇన్నింగ్స్ లు ఆడటం లేదు. ఇటీవలె ఇంగ్లండ్ తో ముగిసిన టి20, వన్డే సిరీస్ ల్లోనూ ఆమె తేలిపోయింది. దాంతో ఆమెను పక్కన పెట్టి వేరే వాళ్లకి అవకాశం ఇవ్వాలని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. అయితే షఫాలీ వర్మను మాత్రం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వెనుకేసుకొచ్చింది. త్వరలోనే షఫాలీ ఫామ్ లోకి వస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. ఇక ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న జెమీమా రోడ్రిగ్స్ మళ్లీ జట్టులోకి రానుంది. బౌలింగ్ లో రేణుక సింగ్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ లు కీలకం కానున్నారు.

తుది జట్లు

టీమిండియా 

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, హేమలత, స్నేహ్ రాణా, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రేణుక సింగ్

శ్రీలంక

హసిని పెరీరా, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత మాదవి, అనుష్క, నిలాక్షి డిసిల్వా, కవిశ దిల్హారి, సెహని, ఒషాడి రణసింఘే, సుగందిక కుమారి, రణవీర, అచిని కులసూర్య

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bangladesh, Bcci, India vs South Africa, India vs srilanka, Smriti Mandhana, Women's Asia Cup

ఉత్తమ కథలు