హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs SL W : ఇక మహిళల ఆసియా కప్.. కఠిన ప్రత్యర్థితో టీమిండియా పోరు.. తుది జట్టు ఇదే

IND W vs SL W : ఇక మహిళల ఆసియా కప్.. కఠిన ప్రత్యర్థితో టీమిండియా పోరు.. తుది జట్టు ఇదే

PC : BCCI/Twitter

PC : BCCI/Twitter

Women's Asia cup 2022 - IND W vs SL W : మహిళల విభాగంలో మరో ఆసక్తికర టోర్నమెంట్ కు తెర లేవనుంది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు బంగ్లాదేశ్ (Bangladesh) వేదికగా మహిళల ఆసియా కప్ (Asia Cup) 2022 జరగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Women's Asia cup 2022 - IND W vs SL W : మహిళల విభాగంలో మరో ఆసక్తికర టోర్నమెంట్ కు తెర లేవనుంది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు బంగ్లాదేశ్ (Bangladesh) వేదికగా మహిళల ఆసియా కప్ (Asia Cup) 2022 జరగనుంది. టోర్నీ తొలి రోజు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో ఆతిథ్య బంగ్లాదేశ్ తో  థాయ్ లాండ్ (Thailand) తలపడనుంది. అనంతరం శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుతో భారత మహిళల జట్టు పోటీ పడనుంది. మహిళల టి20 ప్రపంచకప్ (T20 World Cup) కు 6 నెలల కంటే కూడా తక్కవ సమయం ఉండటంతో భారత్ ఇప్పటి నుంచే తమ సన్నాహకాలను ఆరంభించే అవకాశం ఉంది. 2020లో జరిగిన టి20 ప్రపంచకప్ లో భారత్ తుది మెట్టుపై బోల్తా పడిన సంగతి తెలిసిందే.

ఆసియా కప్ లో భారత్ దే  హవా. ఇప్పటి వరకు ఈ టోర్నీ 7 సార్లు జరిగింది. ఇందులో భారత్ ఏకంగా 6 సార్లు నెగ్గడం విశేషం. బంగ్లాదేశ్ ఒకసారి విజేతగా నిలిచింది. 2018లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పై నెగ్గిన బంగ్లాదేశ్ తొలిసారి చాంపియన్ గా నిలిచింది. తొలి మ్యాచ్ లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే టీమిండియాను కూడా కొన్ని సమస్యలు వెంటాడుతోంది. అదే కీలక పోరుల్లో తడపడటం. గ్రూప్ దశలో రాణించినా.. ఫైనల్ పోరులో మాత్రం ఓడిపోతూనే ఉంది. ఇటీవలె ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో కూడా ఫైనల్ చేరిన భారత్.. టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయింది.

కలవరపెడుతున్న లేడీ సెహ్వాగ్

టీమిండియా లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ ఈ మధ్య కాలంలో పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడుతుంది. మరో ఓపెనర్ స్మృతి మంధాన మాదిరి భారీ ఇన్నింగ్స్ లు ఆడటం లేదు. ఇటీవలె ఇంగ్లండ్ తో ముగిసిన టి20, వన్డే సిరీస్ ల్లోనూ ఆమె తేలిపోయింది. దాంతో ఆమెను పక్కన పెట్టి వేరే వాళ్లకి అవకాశం ఇవ్వాలని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. అయితే షఫాలీ వర్మను మాత్రం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వెనుకేసుకొచ్చింది. త్వరలోనే షఫాలీ ఫామ్ లోకి వస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. ఇక ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న జెమీమా రోడ్రిగ్స్ మళ్లీ జట్టులోకి రానుంది. బౌలింగ్ లో రేణుక సింగ్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ లు కీలకం కానున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 1 (శనివారం) మధ్యాహ్నం 1 గంటకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు హాట్ స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

టీమిండియా తుది జట్టు (అంచనా)

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రేణుక సింగ్, మేఘ్నా సింగ్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bangladesh, India vs South Africa, India vs srilanka, Smriti Mandhana, Women's Asia Cup

ఉత్తమ కథలు