హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs SL W : శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత్.. ఆసియా కప్ లో శుభారంభం

IND W vs SL W : శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత్.. ఆసియా కప్ లో శుభారంభం

PC : BCCI/Twitter

PC : BCCI/Twitter

ND W vs SL W : మహిళల ఆసియా కప్ (Asia cup) 2022లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన తమ ఆరంభ పోరులో టీమిండియా (Team India) 41 పరుగుల తేడాతో శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుపై ఘనవిజయం సాధించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND W vs SL W : మహిళల ఆసియా కప్ (Asia cup) 2022లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన తమ ఆరంభ పోరులో టీమిండియా (Team India) 41 పరుగుల తేడాతో శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుపై ఘనవిజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. హాసిని పెరీరా (32 బంతుల్లో 30; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. హర్షిత సమరవిక్రమ (20 బంతుల్లో 26; 5 ఫోర్లు) అదిరిపోయే శుభారంభం అందించినా మిగిలిన బ్యాటర్లు విఫలం అవ్వడంతో భారత్ విజయం ఖాయం అయ్యింది. భారత బౌలర్లలో హేమలత 3 వికెట్లు తీసింది. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో 2 పాయింట్లు సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ఆరంభం లభించినా

ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్  హర్షిత అదిరిపోయే ఆరంభం ఇచ్చింది. ఫోర్లతో రెచ్చిపోయింది. దాంతో ఓవర్ కు 8 పరుగుల చొప్పున శ్రీలంక పరుగులు సాధించింది. అయితే దీప్తి శర్మ బౌలింగ్ కు రావడంతో అంతా మారిపోయింది. దీప్తి బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన కెప్టెన్ చమరి ఆటపట్టు (5) రేణుక సింగ్ కు క్యాచ్ ఇచ్చి పెవలియన్ కు చేరుకుంది. దీప్తి శర్మ అద్భుత డైరెక్ట్ హిట్ కు శెహని రనౌట్ గా వెనుదిరిగింది. ధాటిగా ఆడుతున్న హర్షిత కూడా రనౌట్ అయ్యింది. ఆ తర్వాత హర్షిని నిలబడినా.. ఆమె నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. మరోవైపు బౌలింగ్ కు వచ్చిన హేమలత శ్రీలంక పతనాన్ని శాసించింది. దాంతో శ్రీలంక విజయానికి చాలా దూరంలోనే ఆగిపోయింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత ఆటతీరును కనబరిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) జెమీమాకు చక్కటి సహకారం అందించింది. శ్రీలంక బౌలర్లలో రణసింఘే 3 వికెట్లు తీసింది. చివర్లో హేమలత (13 నాటౌట్), రిచా ఘోష్ (9) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. దాంతో భారత్ ప్రత్యర్థి ముందు మెరుగైన స్కోరునే ఉంచగలిగింది.

లేడీ సెహ్వాగ్ మరోసారి విఫలం

మహిళల క్రికెట్ జట్టులో సెహ్వాగ్ లా ఉన్న షఫాలీ వర్మ (10) తన పూర్ ఫామ్ ను కొనసాగిస్తుంది. ఓపెనర్ గా వచ్చిన ఆమె మరోసారి విఫలం అయ్యింది. ఇక ఫామ్ లో ఉన్న స్మృతి మంధాన (6) కూడా నిరాశ పరిచింది. దాంతో భారత్ 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ లు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డను పరుగెత్తించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 92 పరుగులు జోడించడం విశేషం. అయితే భారీ షాట్ కు ప్రయత్నించిన హర్మన్ ప్రీత్ కౌర్ స్టంపౌట్ అయ్యింది. కాసేపటికే అర్ధ సెంచరీ చేసిన జెమీమా కూడా పెవిలియన్ కు చేరుకుంది. చివర్లో హేమలత, రిచా ఘోష్ లు ధాటిగా బ్యాటింగ్ చేయడంతో భారత్ 150 మార్కును అందుకుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bangladesh, India vs South Africa, India vs srilanka, Smriti Mandhana, Team India, Women's Asia Cup