IND W vs SL W Final : మహిళల ఆసియా కప్ (Asia Cup) 2022 చాంపియన్ గా టీమిండియా (Team India) నిలిచింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ (India) అంచనాలను నిలబెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుపై భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 8.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 71 పరుగులు చేసి నెగ్గింది. స్మృతి మంధాన (25 బంతుల్లో 51 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) శ్రీలంక బ్యాటర్లను రఫ్ఫాడించింది. షఫాలీ వర్మ (5), జెమీమా రోడ్రిగ్స్ (2) విఫలం అయినా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (11 నాటౌట్)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించింది. స్మృతి మంధాన సిక్సర్ తో మ్యాచ్ ను ఫినిష్ చేయడం విశేషం. ఆసియా కప్ ను నెగ్గడం భారత మహిళల జట్టుకు ఇది ఏడో సారి. ఇప్పటి వరకు మహిళల విభాగంలో 8 సార్లు ఆసియా కప్ జరగ్గా.. ఒక్కసారి మినహా మిగిలిన ఏడు సార్లు కూడా భారతే చాంపియన్ గా నిలిచింది. 2018లో బంగ్లాదేశ్ చాంపియన్ గా నిలిచింది.
ఇది కూడా చదవండి : సచిన్ తనయుడి దాదాగిరి మామూలుగా లేదుగా.. హైదరాబాద్ కు పట్ట పగలే చుక్కలు చూపించాడు
ఫోబియాను ఓడించి
స్మృతి మంధాన క్లాస్ ప్లేయర్ అని అందరికీ తెలుసు. అయితే ఫైనల్లో చేతులెత్తేస్తుందని ఆమెపై ఒక అపవాదు ఉంది. అయితే ఈ ఆసియా కప్ లో మాత్రం ఆ అపవాదును చెరపేసుకుంది స్మృతి మంధాన. 65 పరుగుల టార్గెట్ ఛేదనలో ఆమె చేసిన పరుగులే సింహ భాగం. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తున్నా ఎక్కుడా తడబడకుండా క్లాస్ ఆటతో మ్యాచ్ ను ముగించింది.
CHAMPIONS ????
Congratulations to India on their 7th Women's Asia Cup triumph ????#WomensAsiaCup2022 | Scorecard: https://t.co/KKwY2tz2Pb | ???? @ACCMedia1 pic.twitter.com/7U15d7ibT3 — ICC (@ICC) October 15, 2022
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 65 పరుగులు చేసింది. శ్రీలంక తరఫున 10వ నంబర్ ప్లేయర్ ఇనోక రణవీర (22 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం. ఒషాది రణసింఘె (20 బంతుల్లో 13; 1 ఫోర్) ఇనోకతో పాటు రెండంకెల స్కోరును నమోదు చేసింది. అజేయమైన పదో వికెట్ కు జోడించిన 22 పరుగులే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. భారత ప్లేయర్లలో రేణుక సింగ్ 3 వికెట్లు తీశాడు. స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs srilanka, Smriti Mandhana, Sri Lanka, Team India, Women's Asia Cup