హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs MAL W : హర్మన్.. నీ తెలివికి సలాం.. సూపర్ స్ట్రాటజీతో భారత్ కు విజయాన్ని అందించిన కెప్టెన్.. ఎలా అంటే?

IND W vs MAL W : హర్మన్.. నీ తెలివికి సలాం.. సూపర్ స్ట్రాటజీతో భారత్ కు విజయాన్ని అందించిన కెప్టెన్.. ఎలా అంటే?

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

Women's Asia cup 2022 - IND W vs MAL W : మహిళల ఆసియా కప్ (Asia cup) 2022లో భారత (India) మరో విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ (Bangladesh) వెేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Women's Asia cup 2022 - IND W vs MAL W : మహిళల ఆసియా కప్ (Asia cup) 2022లో భారత (India) మరో విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ (Bangladesh) వెేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో భారత్ 30 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం) విజయం సాధించింది. అయితే భారత్ ఈ విజయం సాధించడానికి ముఖ్య కారణం సారథి హర్మన్ ప్రీత్ కౌర్ (HarmanPreet Kaur). టీమిండియా ఇన్నింగ్స్ ముగిసే సరికి గ్రౌండ్ చుట్టూ దట్టమైన నల్లటి మబ్బులు చుట్టుముట్టాయి. వర్షం రావడానికి ఎంతో సమయం పట్టేలా కనిపించలేదు.  టి20ల్లో డక్ వర్త్ లూయిస్ పద్దతిని అమలు పరచాలంటే రెండోసార బ్యాటింగ్ చేసే జట్టు కనీసం 5 ఓవర్లనైనా ఆడి ఉండాలి.

ఇక మలేసియా ఛేదనను ఆరంభించే సమయానికి వర్షం వచ్చేలా కనిపించింది. దాంతో తెలివిగా ఆలోచించిన హర్మన్ ప్రీత్ కౌర్ రెండు ఎండ్స్ నుంచి స్పిన్నర్లతో బౌలింగ్ చేయించింది. ఫాస్ట్ బౌలర్లతో బౌలింగ్ చేయిస్తే ఓవర్లు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుందని భావించిన హర్మన్.. స్పిన్నర్లతో బరిలోకి దింపింది. దాంతో దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ లు వేగంగా బౌలింగ్ చేశారు. ఇరువురు స్పిన్నర్లకు ఒక్కో వికెట్ చొప్పున లభించింది. ఇక 5 ఓవర్లు పూర్తి కాగానే.. పేసర్ ను రంగంలోకి దింపింది. 6వ ఓవర్ లో మేఘ్నా సింగ్ రెండు బంతులు వేసిందో లేదో వర్షం మొదలైంది. వెంటనే మ్యాచ్ ను నిలిపివేశారు. అప్పటికి మలేసియా జట్టు 2 వికెట్లకు 12 పరుగులు మాత్రమే చేసింది. ఇక వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ 30 పరుగుల తేడాతో గెలిచింది. ఒక వేళ హర్మన్ స్పిన్నర్లతో కాకుండా పేసర్లతో బౌలింగ్ చేయించి ఉంటే మ్యాచ్ ఫలితం తేలి ఉండేది కాదు. అయితే తెలివిగా వ్యవహరించిన హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ ను గెలిచేలా చేసింది.

ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగుల భారీ స్కోరు చేసింది. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (53 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) మలేసియా బౌలర్లకు చుక్కలు చూపించింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (39 బంతుల్లో 46; 1 ఫోర్, 3 సిక్సర్లు) మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. చివర్లో రిచా ఘోష్ (19 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి ఇన్నింగ్స్ ను పూర్తి చేసింది. మలేసియా బౌలర్లలో నూర్ దనియా స్యూహద 2 వికెట్లు తీసింది .ఆమెతో పాటు కెప్టెన్ దురై సింగం కూడా 2 వికెట్లతో రాణించింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bangladesh, India vs South Africa, Malaysia, Smriti Mandhana, Team India, Women's Asia Cup

ఉత్తమ కథలు