హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs MAL W : లేడీ గంగూలీ అవుట్.. తెలుగమ్మాయి ఇన్.. ఆసియా కప్ లో పసికూనతో టీమిండియా పోరు.. తుది జట్లు ఇవే

IND W vs MAL W : లేడీ గంగూలీ అవుట్.. తెలుగమ్మాయి ఇన్.. ఆసియా కప్ లో పసికూనతో టీమిండియా పోరు.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

Women's Asia cup 2022 - IND W vs MAL W : మహిళల ఆసియ ా కప్ (Asia Cup) 2022లో టీమిండియా (Team India) మహిళల జట్టు మరో పోరుకు సిద్ధమైంది. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్ తన రెండో లీగ్ మ్యాచ్ ను పసికూన మలేసియా మహిళల (Malaysia) జట్టుతో ఆడనుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Women's Asia cup 2022 - IND W vs MAL W : మహిళల ఆసియ ా కప్ (Asia Cup) 2022లో టీమిండియా (Team India) మహిళల జట్టు మరో పోరుకు సిద్ధమైంది. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్ తన రెండో లీగ్ మ్యాచ్ ను పసికూన మలేసియా మహిళల (Malaysia) జట్టుతో ఆడనుంది. టాస్ నెగ్గిన మలేసియా కెప్టెన్ దురైసింగం ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక పసికూనతో మ్యాచ్ కాబట్టి భారత్ నాలుగు మార్పులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానతో పాటు పూజా వస్త్రాకర్, రేణుక సింగ్, స్నేహ్ రాణాలకు విశ్రాంతి ఇచ్చింది. వారి స్థానాల్లో తెలుగమ్మాయి సబ్బినేని మేఘనతో పాటు రాధా యాదవ్, కేపీ నవ్ గిరె, మేఘ్నా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్ లకు చోటు ఇచ్చింది.

భారీ మార్పులు

తొలి మ్యాచ్ లో శ్రీలంకపై ఘనవిజయం సాధించిన భారత్ ఈ టోర్నీలో శుభారంభం చేసింది. అయితే రెండో మ్యాచ్ లో పసికూన మలేసియాతో తలపడనుండటంతో కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చింది. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఉక్కపోత వాతావరణం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మ్యాచ్ లు మధ్యాహ్నం జరుగుతుండటంతో ప్లేయర్లు అలసిపోతున్నారు. ఈ క్రమంలో కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వాలని టీమిండియా భావించింది. దాంతో విజయవాడ అమ్మాయి సబ్బినేని మేఘనకు తుది జట్టులో అవకాశం వచ్చింది. ఈ మధ్య కాలంలో సబ్బినేని మేఘన పెద్దగా రాణించడం లేదు. ఈ మ్యాచ్ లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదలగా ఉంది. అదే సమయంలో హార్డ్ హిట్టర్ కేపీ నవ్ గిరె తుది జట్టులోకి వచ్చింది.

ఇక ఇరు జట్ల మధ్య ఒకే ఒక మ్యాచ్ జరిగింది. 2018 ఆసియా కప్ లో భాగంగా భారత్ ,మలేసియా జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 169 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ 97 పరుగులు చేసింది. ఆ తర్వాత మలేసియా కేవలం 27 పరుగులకే ఆలౌటైంది. దాంతో భారత్ 142 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం  సాధించింది.

తుది జట్లు

టీమిండియా 

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, కేపీ నవ్ గిరె, రిచా ఘోష్, హేమలత, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, మేఘ్నా సింగ్

మలేసియా

దురై సింగం (కెప్టెన్), వాన్ జులియా, మాస్ ఎలీసా, ఎల్సా హంటర్, మహిరా, హమీజా హసీం, జమహిదయ, నుర్ అరియాన, షాషా అజ్మీ, నూర్ హయతి జకారియ, నూర్ దనియా

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bangladesh, Malaysia, Smriti Mandhana, Team India, Women's Asia Cup

ఉత్తమ కథలు