హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs MAL W : మలేసియా బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించిన తెలుగమ్మాయి.. పసికూన ముందు భారీ టార్గెట్

IND W vs MAL W : మలేసియా బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించిన తెలుగమ్మాయి.. పసికూన ముందు భారీ టార్గెట్

PC : TWITTER

PC : TWITTER

Women's Asia cup 2022 - IND W vs MAL W : మహిళల ఆసియా కప్ (Women's Asia Cup) 2022లో భారత (India) బ్యాటర్లు రెచ్చిపోయారు. పసికూన మలేసియా (Malaysia)తో జరిగిన తమ రెండో లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా (Team India) భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Women's Asia cup 2022 - IND W vs MAL W : మహిళల ఆసియా కప్ (Women's Asia Cup) 2022లో భారత (India) బ్యాటర్లు రెచ్చిపోయారు. పసికూన మలేసియా (Malaysia)తో జరిగిన తమ రెండో లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా (Team India) భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగుల భారీ స్కోరు చేసింది. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (53 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) మలేసియా బౌలర్లకు చుక్కలు చూపించింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (39 బంతుల్లో 46; 1 ఫోర్, 3 సిక్సర్లు) మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. చివర్లో రిచా ఘోష్ (19 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి ఇన్నింగ్స్ ను పూర్తి చేసింది. మలేసియా బౌలర్లలో నూర్ దనియా స్యూహద 2 వికెట్లు తీసింది .ఆమెతో పాటు కెప్టెన్ దురై సింగం కూడా 2 వికెట్లతో రాణించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు సబ్బినేని మేఘన, షఫాలీ వర్మలు శుభారంభం చేశారు. బలహీన బౌలింగ్ ను, పేలవ ఫీల్డింగ్ ను తమకు అనుకూలంగా మార్చుకున్న వీరు ధాటిగా బ్యాటింగ్ చేశారు. పలుమార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి మలేసియా పేలవ ఫీల్డింగ్ వల్ల తప్పించుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్ 116 పరుగులు జోడించారు. అయితే భారీ షాట్ కు  ప్రయత్నించి మేఘన పెవిలియన్ కు చేరుకుంది. కాసేపటికే షఫాలీ వర్మ క్లీన్ బౌల్డ్ అయ్యింది. పవర్ హిట్టర్ కేపీ నవ్ గిరె (0) ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై గోల్డెన్ డక్ గా వెనుదిరిగింది. చవర్లో రిచా ఘోష్ మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు అందుకుంది. ఒక దశలో భారత్ 200 మార్కును అందుకునేలా కనిపించింది. అయితే మలేసియా బౌలర్లు ఆఖరి 2 ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 200 పరుగులకు చేరువగా వచ్చి ఆగిపోయింది.

నాలుగు మార్పులతో

ఇక పసికూనతో మ్యాచ్ కాబట్టి భారత్ నాలుగు మార్పులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానతో పాటు పూజా వస్త్రాకర్, రేణుక సింగ్, స్నేహ్ రాణాలకు విశ్రాంతి ఇచ్చింది. వారి స్థానాల్లో తెలుగమ్మాయి సబ్బినేని మేఘనతో పాటు రాధా యాదవ్, కేపీ నవ్ గిరె, మేఘ్నా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్ లకు చోటు ఇచ్చింది.

తుది జట్లు

టీమిండియా 

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, కేపీ నవ్ గిరె, రిచా ఘోష్, హేమలత, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, మేఘ్నా సింగ్

మలేసియా

దురై సింగం (కెప్టెన్), వాన్ జులియా, మాస్ ఎలీసా, ఎల్సా హంటర్, మహిరా, హమీజా హసీం, జమహిదయ, నుర్ అరియాన, షాషా అజ్మీ, నూర్ హయతి జకారియ, నూర్ దనియా

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bangladesh, Malaysia, Smriti Mandhana, Team India, Women's Asia Cup

ఉత్తమ కథలు