హోమ్ /వార్తలు /క్రీడలు /

Womens Asia Cup 2022 : టీమిండియా అబద్దాల కోరు..రనౌట్ విషయంలో చెప్పినవన్నీ అబద్దాలే.. కౌంటర్ ఇచ్చిన హర్మన్ ప్రీత్

Womens Asia Cup 2022 : టీమిండియా అబద్దాల కోరు..రనౌట్ విషయంలో చెప్పినవన్నీ అబద్దాలే.. కౌంటర్ ఇచ్చిన హర్మన్ ప్రీత్

PC : TWITTER

PC : TWITTER

Womens Asia Cup 2022 : ఇంగ్లండ్ (England) మహిళల జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ రనౌట్ (మన్కడింగ్)తో ముగిసిన విషయం తెలిసిందే. 170 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 16 పరుగుల తేడాతో ఓడిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Womens Asia Cup 2022 : ఇంగ్లండ్ (England) మహిళల జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ రనౌట్ (మన్కడింగ్)తో ముగిసిన విషయం తెలిసిందే. 170 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. విజయానికి 17 పరుగులు కావాల్సిన తరుణంలో చార్లీ డీన్ (Charlie Deen)ను దీప్తి శర్మ రనౌట్ (మన్కడింగ్) చేసింది. కొత్త రూల్స్ ప్రకారం మన్కడింగ్ ను రనౌట్ గా పరిగణిస్తారు. రనౌట్ అయిన చార్లీ డీన్ మైదానంలోనే కంటతడి పెట్టుకుంది. ఇక ఈ రనౌట్ పై చాలా మంది క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక దీనిపై స్పందించిన దీప్తి శర్మ.. చార్లీ డీన్ ను చాలా సార్లు హెచ్చరించినట్లు కూడా పేర్కొంది.

అయితే దీనిపై ఇంగ్లండ్ ప్లేయర్ హీథర్ నైట్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘మ్యాచ్ ముగిసింది. మ్యాచ్ విజయానికి, సిరీస్ విజేతగా నిలిచే అర్హత భారత్ కు ఉంది. అయితే మన్కడింగ్ విషయంలో చార్లీ డీన్ కు ముందుగా ఎటువంటి హెచ్చరికలు చేయలేదు. చార్లీ డీన్ ను హెచ్చరించామని దీప్తి శర్మ చెప్పింది అబద్ధం‘ అంటూ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ లో ఉంది. అక్టోబర్ 1 నుంచి ఆరంభమయ్యే ఆసియా కప్ కోసం రెడీ అవుతుంది. ఈ క్రమంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పాల్గొంది. ఈ సందర్భంగా హీథర్ నైట్ ట్వీట్ గురించి ఒక రిపోర్టర్ హర్మన్ ను ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన ఆమె.. ‘మేము రూల్స్ ప్రకారమే వ్యవహరించాం. మరోసారి ఇదే పనిని చేసేందుకు మేము సిద్ధమే‘ అంటూ పేర్కొంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bangladesh, India vs england, India vs South Africa, India vs srilanka, Smriti Mandhana, Team India, Women's Asia Cup

ఉత్తమ కథలు