హోమ్ /వార్తలు /క్రీడలు /

Women's Asia Cup 2022 : మహిళల ఆసియా కప్ కు రంగం సిద్ధం.. ఎప్పటి నుంచి అంటే? టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే

Women's Asia Cup 2022 : మహిళల ఆసియా కప్ కు రంగం సిద్ధం.. ఎప్పటి నుంచి అంటే? టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే

PC : BCCI/Twitter

PC : BCCI/Twitter

Women's Asia Cup 2022 : పురుషుల విభాగంలో ఆసియా కప్ (Asia cup) ముగిసి నెల రోజులు కూడా అవ్వలేదు అప్పుడే మరోసారి క్రికెట్ లవర్స్ ను అలరించేందుకు మన ముందుకు వచ్చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Women's Asia Cup 2022 : పురుషుల విభాగంలో ఆసియా కప్ (Asia cup) ముగిసి నెల రోజులు కూడా అవ్వలేదు అప్పుడే మరోసారి క్రికెట్ లవర్స్ ను అలరించేందుకు మన ముందుకు వచ్చేసింది. బంగ్లాదేశ్ (Bangladesh) వేదికగా మహిళల విభాగంలో ఆసియా కప్ జరగనుంది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 7 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో భారత్ మహిళల జట్టుతో పాటు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా, థాయ్ లాండ్, యూఏఈ జట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ టోర్నీ 7 సార్లు జరగ్గా.. అందులో భారత్ ఏకంగా 6 సార్లు విజేతగా నిలిచింది. ఇక ఒకసారి బంగ్లాదేశ్ జట్టు గెలిచింది

రికార్డు స్థాయిలో 8వసారి ఈ టోర్నీలో విజేతగా నిలవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. ఇక అదే సమయంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 1న బంగ్లాదేశ్, థాయ్ లాండ్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్ తో ఈ టోర్నీ ఆరంభం కానుంది. అదే రోజు భారత్ కూడా తన తొలి పోరును ఆడనుంది. శ్రీలంక మహిళల జట్టుతో భారత్ తన తొలి పోరును ఆడనుంది. మొత్తం 7 జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిన మ్యాచ్ లు జరుగుతాయి. ఒక్కో జట్టు మిగిలిన 6 జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున జరుగుతుంది. ఈ మ్యాచ్ లు పూర్తయ్యాక టాప్ 4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు చేరుకుంటాయి.

పూర్తి షెడ్యూల్ ఇదే

ఎప్పుడుఎవరు ఎవరితోఎక్కడసమయం
అక్టోబర్ 1బంగ్లాదేశ్ X థాయ్ లాండ్సిల్హెట్ఉ.గం.8.30
అక్టోబర్ 1భారత్ X శ్రీలంకసిల్హెట్మ.గం.1.00
అక్టోబర్ 2మలేసియా X పాకిస్తాన్సిల్హెట్ఉ.గం.8.30
అక్టోబర్ 2శ్రీలంక X యూఏఈసిల్హెట్మ.గం.1.00
అక్టోబర్ 3మలేసియా X పాకిస్తాన్సిల్హెట్ఉ.గం.8.30
అక్టోబర్ 3భారత్ X మలేసియాసిల్హెట్మ.గం.1.00
అక్టోబర్ 4శ్రీలంక X థాయ్ లాండ్సిల్హెట్ఉ.గం.8.30
అక్టోబర్ 4భారత్ X యూఏఈసిల్హెట్మ.గం.1.00
అక్టోబర్ 5మలేసియా X యూఏఈసిల్హెట్మ.గం.1.00
అక్టోబర్ 6పాకిస్తాన్ X థాయ్ లాండ్సిల్హెట్ఉ.గం.8.30
అక్టోబర్ 6బంగ్లాదేశ్ X మలేసియాసిల్హెట్మ.గం.1.00
అక్టోబర్ 7థాయ్ లాండ్  X యూఏఈసిల్హెట్ఉ.గం.8.30
అక్టోబర్ 7భారత్ X పాకిస్తాన్సిల్హెట్మ.గం.1.00
అక్టోబర్ 8మలేసియా X శ్రీలంకసిల్హెట్ఉ.గం.8.30
అక్టోబర్ 8భారత్ X బంగ్లాదేశ్సిల్హెట్మ.గం.1.00
అక్టోబర్ 9మలేసియా X థాయ్ లాండ్సిల్హెట్ఉ.గం.8.30
అక్టోబర్ 9పాకిస్తాన్  X యూఏఈసిల్హెట్మ.గం.1.00
అక్టోబర్ 10బంగ్లాదేశ్ X శ్రీలంకసిల్హెట్ఉ.గం.8.30
అక్టోబర్ 10భారత్ X థాయ్ లాండ్సిల్హెట్మ.గం.1.00
అక్టోబర్ 11బంగ్లాదేశ్ X యూఏఈసిల్హెట్ఉ.గం.8.30
అక్టోబర్ 11పాకిస్తాన్ X శ్రీలంకసిల్హెట్మ.గం.1.00
అక్టోబర్ 13సెమీఫైనల్ 1సిల్హెట్ఉ.గం.8.30
అక్టోబర్ 13సెమీఫైనల్ 2సిల్హెట్మ.గం.1.00
అక్టోబర్ 15ఫైనల్సిల్హెట్మ.గం.1.00

First published:

Tags: Bangladesh, Mithali Raj, Smriti Mandhana, Sri Lanka, Team India, Women's Asia Cup

ఉత్తమ కథలు