హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs SL W Final : టైటిల్ పోరులో ఇండియాకు బ్యాడ్ లక్.. టాస్ నెగ్గిన శ్రీలంక.. లేడీ జడేజా అవుట్.. తుది జట్లు ఇవే

IND W vs SL W Final : టైటిల్ పోరులో ఇండియాకు బ్యాడ్ లక్.. టాస్ నెగ్గిన శ్రీలంక.. లేడీ జడేజా అవుట్.. తుది జట్లు ఇవే

PC : BCCI

PC : BCCI

Women's Asia cup 2022 Final - IND W vs SL W : రెండు వారాలుగా అలరించిన మహిళల ఆసియా కప్ (Women's Asia Cup) 2022 తుది పోరుకు చేరుకుంది. మరికొన్ని నిమిషాల్లో ఆరంభమయ్యే ఫైనల్లో 6 సార్లు చాంపియన్ టీమిండియా (Team India) మహిళల జట్టుతో శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టు తలపడనుంది,

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Women's Asia cup 2022 Final - IND W vs SL W : రెండు వారాలుగా అలరించిన మహిళల ఆసియా కప్ (Women's Asia Cup) 2022 తుది పోరుకు చేరుకుంది. మరికొన్ని నిమిషాల్లో ఆరంభమయ్యే ఫైనల్లో 6 సార్లు చాంపియన్ టీమిండియా (Team India) మహిళల జట్టుతో శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టు తలపడనుంది. ఈ ఫైనల్లో టాస్ నెగ్గిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఎటువంటి మార్పులు చేయకపోవడం విశేషం. అయితే భారత్ మాత్రం ఈ మ్యాచ్ కోసం ఒక మార్పు చేసింది. ఆల్ రౌండర్ రాధా యాదవ్ ను పక్కన పెట్టి ఆమె స్థానంలో మరో ఆల్ రౌండర్ హేమలతను తుది జట్టులోకి తీసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఒక్కసారి మాత్రమే ఛేజింగ్ చేసింది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రెండోసారి బ్యాటింగ్ చేసిన భారత్ ఓడిపోయింది. భారత్, శ్రీలంక జట్ల మధ్య లీగ్ స్టేజ్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియానే గెలిచింది.

ఫైనల్ ఫోబియా

భారత్ ను ఫైనల్ ఫోబియా వేధిస్తోంది. 2018లో జరిగిన ఆసియా కప్ లో కూడా భారత్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత వన్డే, టి20 ప్రపంచకప్ లలో కూడా ఫైనల్లో చతికిల పడింది. ఇక ఈ మధ్యే జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ పోరులో భారత్ ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. టోర్నీలో ఎంత గొప్పగా ఆడినా కూడా ఫైనల్లో ఓడిపోవడం భారత్ కు ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతూ వస్తుంది. అయితే ఈసారి మాత్రం అటువంటివి జరగకుండా ఆసియా కప్ చాంపియన్ గా అనిపించుకోవాలనే పట్టుదలగా హర్మన్ ప్రీత్ నాయకత్వంలో భారత్ ఉంది.

బౌలింగ్, బ్యాటింగ్ సూపర్

టోర్నమెంట్ లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ అద్భుతంగా ఉంది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓడటం తప్ప మిగిలిన అన్ని మ్యాచ్ ల్లోనూ సూపర్ షోతో అదరగొట్టింది. ముఖ్యంగా జెమీమా రోడ్రిగ్స్ సూపర్ ఫామ్ లో ఉంది. ఆమెతో పాటు స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలీ వర్మలు కూడా టచ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ లో దీప్తి శర్మ, హేయలతలతో పాటు పూజా వస్త్రాకర్, రేణుక సింగ్ మరోసారి కీలకం కానున్నారు.

తుది జట్లు

టీమిండియా

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, హేమలత, పూజా వస్త్రాకర్, రేణుక సింగ్, రాజేశ్వరి గైక్వాడ్.

శ్రీలంక

హసిని పెరీరా, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత మాదవి, అనుష్క, నిలాక్షి డిసిల్వా, కవిశ దిల్హారి, సెహని, ఒషాడి రణసింఘే, సుగందిక కుమారి, రణవీర, అచిని కులసూర్య

First published:

Tags: India vs srilanka, Smriti Mandhana, Sri Lanka, Team India, Women's Asia Cup

ఉత్తమ కథలు