హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs SL W Final : అతివిశ్వాసంతో చిత్తయిన శ్రీలంక బ్యాటర్స్.. భారత్ ముందు ఈజీ టార్గెట్?

IND W vs SL W Final : అతివిశ్వాసంతో చిత్తయిన శ్రీలంక బ్యాటర్స్.. భారత్ ముందు ఈజీ టార్గెట్?

PC : TWITTER

PC : TWITTER

Women's Asia cup 2022 - IND W vs SL W Final : మహిళల ఆసియా కప్ (T20 World Cup) 2022లో భాగంగా జరుగుతున్న ఫైనల్ పోరులో శ్రీలంక (Sri Lanka) బ్యాటర్స్ చేతులెత్తేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Women's Asia cup 2022 - IND W vs SL W Final : మహిళల ఆసియా కప్ (T20 World Cup) 2022లో భాగంగా జరుగుతున్న ఫైనల్ పోరులో శ్రీలంక (Sri Lanka) బ్యాటర్స్ చేతులెత్తేశారు. దారుణ ఆటతీరుతో నిరాశ పరిచారు. భారత్ (India)తో జరుగుతున్న ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 20 ఓవర్లలో  9 వికెట్లకు 65 పరుగులు చేసింది. శ్రీలంక తరఫున 10వ నంబర్ ప్లేయర్ ఇనోక రణవీర (22 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం. ఒషాది రణసింఘె (20 బంతుల్లో 13; 1 ఫోర్) ఇనోకతో పాటు రెండంకెల స్కోరును నమోదు చేసింది. అజేయమైన పదో వికెట్ కు జోడించిన 22 పరుగులే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. భారత ప్లేయర్లలో రేణుక సింగ్ 3 వికెట్లు తీశాడు. స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీశారు.

పెవిలియన్ కు క్యూ

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. అనుష్క సంజీవని తో సమన్వయ లోపంతో కెప్టెన్ చమరి ఆటపట్టు (6) రనౌట్ అయ్యింది. ఇక నాలుగో ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన రేణుక సింగ్ రెండు వికెట్లే తీసింది. అనుష్క (2) రనౌట్ అయ్యింది. కాసేపటికే కవిష (1) కూడా పెవిలియన్ కు చేరింది. దాంతో శ్రీలంక 16 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు కూడా ఆడేది కష్టంలా కనిపించింది. అయితే ఒషాది రణసింఘెతో పాటు చివర్లో ఇనోక రణవీర ఆడటంతో ఆలౌట్ నుంచి శ్రీలంక తప్పించుకుంది.

అనవసరపు షాట్లు

శ్రీలంకను అనవసరపు షాట్లు.. తొందరపాటు తనం దెబ్బ తీశాయి. కీలక సమయాల్లో ఓపెనర్లు రనౌట్లు అయ్యారు. అదే సమయంలో స్పిన్ కు సహకరిస్తున్న పిచ్ పై భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వికెట్లను కోల్పోయింది.

ఇది కూడా చదవండి : ఒక్కడే.. కోహ్లీ ఒక్కడే.. కింగ్ ముందు యంగ్ ప్లేయర్స్ కూడా బలాదూర్

తుది జట్లు

టీమిండియా

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, హేమలత, పూజా వస్త్రాకర్, రేణుక సింగ్, రాజేశ్వరి గైక్వాడ్.

శ్రీలంక

హసిని పెరీరా, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత మాదవి, అనుష్క, నిలాక్షి డిసిల్వా, కవిశ దిల్హారి, సెహని, ఒషాడి రణసింఘే, సుగందిక కుమారి, రణవీర, అచిని కులసూర్య

First published:

Tags: India vs srilanka, Smriti Mandhana, Sri Lanka, Team India, Women's Asia Cup

ఉత్తమ కథలు