IND W vs SL W Final : మహిళల ఆసియా కప్ (Asia cup) 2022 తుది అంకానికి చేరుకుంది. బంగ్లాదేశ్ (Bangladesh) వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీ శనివారం జరిగే ఫైనల్ పోరుతో ముగియనుంది. టైటిల్ కోసం 6 సార్లు చాంపియన్ టీమిండియా (Team India) మహిళల జట్టుతో శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టు పోటీ పడనుంద. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లు ఈ మ్యాచ్ ను ప్రత్యక్షప్రసారం చేయనున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా భారత్ బరిలోకి దిగనుంది. అయితే శ్రీలంకను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. సెమీఫైనల్ 2లో తన కంటే బలమైన పాకిస్తాన్ ను శ్రీలంక పరుగు తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఇటీవలె ముగిసిన పురుషుల ఆసియా కప్ లో శ్రీలంక జట్టు చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పురుషుల జట్టు అడుగు జాడల్లోనే మహిళల జట్టు కూడా ఆసియా కప్ ను గెలవాలని పట్టుదలగా ఉంది.
ఇది కూడా చదవండి : మెగా టోర్నీలో అండర్ డాగ్ గా ఆసియా టీం.. ఫేవరెట్లకు షాకిస్తుందా?
ఫైనల్ ఫోబియా
భారత్ ను ఫైనల్ ఫోబియా వేధిస్తోంది. 2018లో జరిగిన ఆసియా కప్ లో కూడా భారత్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత వన్డే, టి20 ప్రపంచకప్ లలో కూడా ఫైనల్లో చతికిల పడింది. ఇక ఈ మధ్యే జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ పోరులో భారత్ ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. టోర్నీలో ఎంత గొప్పగా ఆడినా కూడా ఫైనల్లో ఓడిపోవడం భారత్ కు ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతూ వస్తుంది. అయితే ఈసారి మాత్రం అటువంటివి జరగకుండా ఆసియా కప్ చాంపియన్ గా అనిపించుకోవాలనే పట్టుదలగా హర్మన్ ప్రీత్ నాయకత్వంలో భారత్ ఉంది.
బౌలింగ్, బ్యాటింగ్ సూపర్
టోర్నమెంట్ లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ అద్భుతంగా ఉంది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓడటం తప్ప మిగిలిన అన్ని మ్యాచ్ ల్లోనూ సూపర్ షోతో అదరగొట్టింది. ముఖ్యంగా జెమీమా రోడ్రిగ్స్ సూపర్ ఫామ్ లో ఉంది. ఆమెతో పాటు స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలీ వర్మలు కూడా టచ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ లో దీప్తి శర్మ, రాధా యాదవ్ లతో పాటు పూజా వస్త్రాకర్, రేణుక సింగ్ మరోసారి కీలకం కానున్నారు.
టీమిండియా తుది జట్టు (అంచనా)
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, రేణుక సింగ్, రాజేశ్వరి గైక్వాడ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, India vs srilanka, Smriti Mandhana, Sri Lanka, Team India, Women's Asia Cup