Home /News /sports /

WOMEN WORLD CUP IPL UPDATES ENGLAND WOMEN TEAM CAPTAIN HEATHER KNIGHT STUNNING CATCH AT WORLD CUP AGAINST NEW ZEALAND SJN

Heather knight: సూపర్ డైవ్ తో ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న ఇంగ్లండ్ సారథి

హీథర్ నైట్

హీథర్ నైట్

Women World cup: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో ఇంగ్లండ్ (England) మహిళల జట్టు సారథి హీథర్ నైట్ అదరగొట్టింది. గాల్లోకి అద్భుతంగా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో సూపర్ క్యాచ్ ను అందుకుంది.

Heather knight: న్యూజిలాండ్ (New Zealand) వేదికగా జరుగుతోన్న మహిళల వన్డే ప్రపంచకప్ (World cup) ఆఖరి దశకు చేరుకుంది . టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా... ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టు ఇప్పటికే సెమీఫైనల్ కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా (South Africa) టీం కూడా  దాదాపుగా సెమీఫైనల్ కు చేరుకున్నట్లే కనిపిస్తోంది.  అయితే మరో రెండు స్థానాల కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం ఇంగ్లండ్, భారత్ (India), వెస్టిండీస్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఇక వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం ఆతిథ్య న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య సూపర్ మ్యాచ్ జరిగింది. విజయం ఇరు జట్ల మధ్య దోబుచులాడుతూ చివరకు ఇంగ్లండ్ పక్షాన నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ సారథి హీథర్ నైట్ సూపర్ క్యాచ్ తో అదరగొట్టింది.

న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో 39వ ఓవర్ వేయడానికి ఇంగ్లండ్  బౌలర్ ఎక్లెస్టోన్ వచ్చింది. ఆమె వేసిన ఆ ఓవర్ రెండో బంతిని కివీస్ బ్యాటర్ లీ తహూహు కవర్స్ లోకి ఆడింది. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న హీథర్ నైట్ తన కుడివైపుకు డైవ్ చేస్తూ గాల్లో ఒంటి చేత్తో క్యాచ్ ను అందుకుంది. పక్షిలా ఆమె చేసిన ఈ విన్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది








View this post on Instagram






A post shared by ICC (@icc)






ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు వికెట్ తేడాతో కివీస్ పై గెలిచి నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 48.5 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో న్యూజిలాండ్ 2 వికెట్లకు 134 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో కివీస్ టీం కకావికలం అయ్యింది. న్యూజిలాండ్ ప్లయర్లలో మ్యాడీ గ్రీన్ (75 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో ఆకట్టుకుంది.

అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్ కిందా మీద పడుతూ 47.2 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు టామీ బీమౌంట్ (25), డాని వ్యాట్ (12) మరోసారి విఫలమయ్యారు. ఈ సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ నాట్ స్కీవర్ (108 బంతుల్లో 61; 5 ఫోర్లు) అర్ధ శతకంతో జట్టును ఆదుకుంది. ఆమెకు హీథర్ నైట్ (53 బంతుల్లో 42; 4 ఫోర్లు) చక్కటి సహకారం అందించింది. దాంతో ఇంగ్లండ్ టార్గెట్ ను ఈజీగా రీచ్ అవుతుందని అనిపించింది. అయితే కివీస్ పేసర్లు ముఖ్యంగా ఫ్రాన్సెస్ మెకాయ్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ ను దెబ్బతీసింది. వరుస పెట్టి వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ ప్లేయర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. అయితే సోఫియా డంక్లీ (43 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) జట్టు విజయం కోసం ఒంటరి పోరాటం చేసింది. అయితే మెకాయ్ డంక్లీని అవుట్ చేయడంతో ఇంగ్లండ్ పరిస్థితి ఘోరంగా తయారైంది. అయతే టెయిలెండర్ ష్రుబ్ సోలే ఫోర్, సింగిల్ తీసి ఇంగ్లండ్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. నాట్ స్కీవర్ కు ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‘ లభించింది. ఆడిన ఆరు మ్యాచ్ ల్లో నాలుగింటిలో ఓడిన న్యూజిలాండ్ ప్రపంచకప్ నాకౌట్ ఆశలకు దాదాపు తెరపడినట్లే.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: England, India, New Zealand, South Africa, World cup

తదుపరి వార్తలు