హోమ్ /వార్తలు /క్రీడలు /

women World cup - IND vs WI: చావో రేవో మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా... గతంలోలా కాకుండా ఈసారి ప్లాన్ మార్చి బరిలోకి

women World cup - IND vs WI: చావో రేవో మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా... గతంలోలా కాకుండా ఈసారి ప్లాన్ మార్చి బరిలోకి

women World cup- IND vs WI: చివరిసారిగా 2017లో జరిగిన ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన టీమిండియా ఈసారి ఎలాగైనా చాంపియన్ అవ్వాలనే లక్ష్యంతో వరల్డ్ కప్ లో బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓ మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ లో ఓడి 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో భారత్ నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి

ఇంకా చదవండి ...

women World cup- IND vs WI: అందని ద్రాక్షలా ఉన్న మహిళల ప్రపంచకప్ (World cup)ను ఈసారి ఎలాగైనా సాధించాలనే కసి మీద ఉన్న టీమిండియా (Team india) మహిళల జట్టు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. టీంలో స్టార్ ప్లేయర్స్ కు కొదవ లేకపోయినా సమష్టిగా రాణించడంలో విఫలమవుతున్నారు. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ (Pakistan)పై ఘనవిజయం సాధించినా... ఆ తర్వాత న్యూజిలాండ్ (new  zealanad)చేతిలో ఓడింది. నాకౌట్ దశకు చేరాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్ కూడా కీలకమే. ఈ సమయంలో నేడు వెస్టిండీస్ (West indies)తో భారత్ తలపడనుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ తో ఆడిన టీంనే మిథాలీ రాజ్ (mithali raj) ఈ మ్యాచ్ లోనూ కంటిన్యూ చేయనుంది.

హెడ్ టు హెడ్ రికార్డ్

వెస్టిండీస్  మహిళల జట్టుతో హెడ్ టు హెడ్ రికార్డులో టీమిండియా మహిళల జట్టుదే పైచేయిగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో వెస్టిండీస్ తో భారత్ ఇప్పటి వరకు 25 వన్డేలు ఆడింది. ఇందులో టీమిండియా 20 మ్యాచ్ ల్లో విజయం సాధించగా...కరీబియన్ టీం 5 మ్యాచ్ ల్లో మాత్రమే గెలుపొందింది.

ప్రపంచకప్ లో ముఖాముఖి రికార్డు

ప్రపంచకప్ ముఖాముఖి రికార్డులో వెస్టిండీస్ పై టీమిండియాకు మరింత ఘనమైన రికార్డు ఉంది. విశ్వ వేదికలపై ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 6 సార్లు తలపడగా... ఆరు సార్లూ టీమిండియా వైపే విజయం చేరింది. 2017లో జరిగిన ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు చివరిసారిగా విశ్వవేదికపై తలపడగా... ఆ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్లకు 183 పరుగులు చేసింది.  స్మృతి మంధాన 108 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను గెలిపించింది.

స్మృతి మందానకు అదిరే రికార్డు

వెస్టిండీస్ పై భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందాన (smriti mandhana)కు అదిరిపోయే రికార్డు ఉంది. కరీబియన్ జట్టుపై ఆమె ఏకంగా 696 పరుగులు చేసింది. అదే విధంగా బౌలర్ల జాబితాలో ప్రస్తుతం ఉన్న టీమిండియాలో జులన్ గోస్వామికి కరీబియన్ టీంపై మంచి రికార్డు ఉంది. ఆమె 19 వికెట్లు తీసింది.

తుది జట్లు :

టీమిండియా : స్మృతి మంధాన, యష్తికా భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రానా, పూజా వట్సేకర్, జులన్ గో స్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

వెస్టిండీస్ : డాటిన్, హేలీ మ్యాథ్యూస్, కైసియా నైట్,  స్టెఫానీ టేలర్ (కెప్టెన్), క్యాంబెల్లె, చెడీన్ నేషన్, చినెల్లే హెన్రీ, అలియా అలియేని, షమిలా కానెల్, అనిసా మొహమ్మద్, షకేరా సాల్మాన్

First published:

Tags: India, India Vs Westindies, Mithali Raj, Smriti Mandhana, Team India, World cup

ఉత్తమ కథలు