హోమ్ /వార్తలు /క్రీడలు /

Women World cup 2022: ప్రపంచకప్ ఫోటో షూట్ లో భారత క్రికెటర్ల హల్చల్... భాంగ్రా స్పెప్పులతో అదరగొట్టిన స్టార్ ప్లేయర్

Women World cup 2022: ప్రపంచకప్ ఫోటో షూట్ లో భారత క్రికెటర్ల హల్చల్... భాంగ్రా స్పెప్పులతో అదరగొట్టిన స్టార్ ప్లేయర్

భారత మహిళల జట్టు (ఫైల్ ఫోటో)

భారత మహిళల జట్టు (ఫైల్ ఫోటో)

Women World cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup) ముంగిట జరిగిన ఫోటో షూట్ లో టీమిండియా (Team India మహిళా క్రికెటర్లు మెరిశారు. ఫోటోలకు ఫోజులివ్వడంతో పాటు స్పెప్పులు కూడా వేశారు. ఒక స్టార్ ప్లేయర్ అయితే ఏకంగా భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టింది.

ఇంకా చదవండి ...

Women World cup 2022: మార్చి 4వ తేదీ నుంచి న్యూజిలాండ్ (New Zealand) మహిళల వన్డే ప్రపంచ కప్ (World cup) ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. టోర్నీలో టీమిండియా (Team India)తో పాటు మరో ఏడు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకున్న అన్ని జట్లు రెండు వార్మప్ మ్యాచ్ లను సైతం ఆడింది. నెల రోజుల ముందుగానే కివీస్ గడ్డపై అడుగు పెట్టిన మిథాలీ రాజ్ (Mithali raj) నాయకత్వంలోని మహిళల జట్టు న్యూజిలాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడింది. అయితే ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చలేకపోయింది. దాంతో ఈసారి కూడా ప్రపంచకప్ లో భారత్ కు నిరాశ తప్పేలా లేదని అనిపించింది. అయితే ప్రపంచకప్ ముందర జరిగిన రెండు వార్మప్ మ్యాచ్ ల్లోనూ భారత్ ఘనవిజయం సాధించింది. తొలుత దక్షిణాఫ్రికా (South Africa)ను ఓడించిన భారత్... అనంతరం వెస్టిండీస్ (West Indies)పై ఘనవిజయం సాధించింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)తో జరిగే మ్యాచ్ తో టీమిండియా తన ప్రపంచ కప్ వేటను ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు ప్రి వరల్డ్ కప్ ఫోటో షూట్ లో పాల్గొంది.

ప్రి వరల్డ్ కప్ ఫోటో షూట్ లో పాల్గొన్న టీమిండియా హల్చల్ చేసింది. సరదాగా ఫోటోలకు ఫోజులిస్తూ... డ్యాన్స్ చేస్తూ ఫోటో షూట్ ను కంప్లీట్ చేసింది. భారత వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. మీరు చూడాలనుకుంటే చూసేయండి మరీ

View this post on Instagram


A post shared by ICC (@icc)న్యూజిలాండ్ తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ లో హర్మన్ ప్రీత్ కౌర్ తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో ఆమెను నాలుగో వన్డే నుంచి తప్పించారు. అదే సమయంలో ఆమె వైస్ కెప్టెన్సీని దీప్తి శర్మకు అప్పగించారు. అయితే ఐదో వన్డేలో హర్మన్ ప్రీత్ జట్టులోకి వచ్చినా... వైస్ కెప్టెన్ గా మాత్రం దీప్తి శర్మనే కొనసాగింది. దాంతో హర్మన్ ప్రీత్ నుంచి వైస్ కెప్టెన్సీని లాగేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రపంచకప్ ముందర సారథి మిథాలీ రాజ్ ఆ వార్తలను కొట్టిపారేసింది. ప్రపంచకప్ లో భారత వైస్ కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇదే తన చివరి వరల్డ్ కప్ అని కూడా ప్రకటించింది.

ప్రపంచకప్ లో టీమిండియా షెడ్యూల్

భారత్ X పాకిస్తాన్                (06-03-2022)

భారత్ X న్యూజిలాండ్    (10-03-2022)

భారత్ X వెస్టిండీస్          (12-03-2022)

భారత్ X ఇంగ్లండ్            (16-03-2022)

భారత్ X ఆస్ట్రేలియా      (19-03-2022)

భారత్ X బంగ్లాదేశ్           (22-03-2022)

భారత్ X దక్షిణాఫ్రికా       (27-03-2022)

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India, Mithali Raj, Pakistan, South Africa, Team India, West Indies, World cup

ఉత్తమ కథలు