హోమ్ /వార్తలు /క్రీడలు /

Women world cup 2022: మిథాలీ రాజ్ విఫలం... హాఫ్ సెంచరీతో ఆదుకున్న స్మృతి మంధాన

Women world cup 2022: మిథాలీ రాజ్ విఫలం... హాఫ్ సెంచరీతో ఆదుకున్న స్మృతి మంధాన

Women world cup 2022:  వన్డే ప్రపంచకప్ లో నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే ఇకపై టీమిండియా ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధించాలి. వెస్టిండీస్ తో ప్రస్తుతం జరుగుతోన్న వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది.

Women world cup 2022: వన్డే ప్రపంచకప్ లో నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే ఇకపై టీమిండియా ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధించాలి. వెస్టిండీస్ తో ప్రస్తుతం జరుగుతోన్న వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది.

Women world cup 2022: వన్డే ప్రపంచకప్ లో నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే ఇకపై టీమిండియా ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధించాలి. వెస్టిండీస్ తో ప్రస్తుతం జరుగుతోన్న వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది.

Women world cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో భాగంగా ప్రస్తుతం వెస్టిండీస్ (West Indies) మహిళల జట్టుతో జరుగుతోన్న పోరులో టీమిండియా (Team India) నిలకడగా ఆడుతోంది. 30 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన (smriti mandhana) (78 బంతుల్లో 65 బ్యాటింగ్; 6 ఫోర్లు), యస్తిక భాటియా (21 బంతుల్లో 31; 6 ఫోర్లు) శుభారంభం చేశారు. ముఖ్యంగా యస్తిక ఫోర్లతో విండీస్ బౌలర్లపై చెలరేగింది. వీరిద్దరూ 6.3 ఓవర్లలోనే 49 పరుగులు జోడించారు. అయితే దూకుడు మీదున్న యస్తిక భాటియాను మ్యాథ్యూస్ బోల్తా కొట్టించింది. దాంతో 49 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అయితే అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన మిథాలీ రాజ్ (Mithali Raj) (5) విఫలం కాగా.. దీప్తి శర్మ (15) నిరాశ పరిచింది.

ఫలితంగా భారత్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ మ్యాచ్ ను గుర్తుకు తెచ్చింది. అయితే ఈ దశలో జతకలిసిన మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ (50 బంతుల్లో 38 బ్యాటింగ్; 4 ఫోర్లు) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. స్కోరు బోర్డు వేగం ఎక్కడా తగ్గకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం 62 పరుగులు జోడించారు.

స్మృతి మందానకు అదిరే రికార్డు

వెస్టిండీస్ పై భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందాన (smriti mandhana)కు అదిరిపోయే రికార్డు ఉంది. కరీబియన్ జట్టుపై ఆమె ఏకంగా 696 పరుగులు చేసింది. అదే విధంగా బౌలర్ల జాబితాలో ప్రస్తుతం ఉన్న టీమిండియాలో జులన్ గోస్వామికి కరీబియన్ టీంపై మంచి రికార్డు ఉంది. ఆమె 19 వికెట్లు తీసింది.

ప్రపంచకప్ లో ముఖాముఖి రికార్డు

ప్రపంచకప్ ముఖాముఖి రికార్డులో వెస్టిండీస్ పై టీమిండియాకు మరింత ఘనమైన రికార్డు ఉంది. విశ్వ వేదికలపై ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 6 సార్లు తలపడగా... ఆరు సార్లూ టీమిండియా వైపే విజయం చేరింది. 2017లో జరిగిన ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు చివరిసారిగా విశ్వవేదికపై తలపడగా... ఆ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్లకు 183 పరుగులు చేసింది.  స్మృతి మంధాన 108 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను గెలిపించింది.

తుది జట్లు :

టీమిండియా : స్మృతి మంధాన, యష్తికా భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రానా, పూజా వట్సేకర్, జులన్ గో స్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

వెస్టిండీస్ : డాటిన్, హేలీ మ్యాథ్యూస్, కైసియా నైట్,  స్టెఫానీ టేలర్ (కెప్టెన్), క్యాంబెల్లె, చెడీన్ నేషన్, చినెల్లే హెన్రీ, అలియా అలియేని, షమిలా కానెల్, అనిసా మొహమ్మద్, షకేరా సాల్మాన్

First published:

Tags: India, India Vs Westindies, Mithali Raj, Smriti Mandhana, Team India, World cup

ఉత్తమ కథలు