హోమ్ /వార్తలు /క్రీడలు /

women world cup 2022: సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన... భారీ స్కోరు దిశగా టీమిండియా

women world cup 2022: సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన... భారీ స్కోరు దిశగా టీమిండియా

స్మృతి మంధాన (PC: ICC Twitter)

స్మృతి మంధాన (PC: ICC Twitter)

women world cup 2022: భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అదరగొట్టింది. గత కొంత కాలంగా తన ఫామ్ పై వస్తోన్న విమర్శలను సూపర్ ఇన్నింగ్స్ తో పటా పంచలు చేసింది.

women world cup 2022: భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (smriti mandhana)  సూపర్ సెంచరీ (110 బంతుల్లో 104 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు)తో చెలరేగిపోయింది. తనకు అచ్చొచ్చిన వెస్టిండీస్ (West Inides) మహిళల జట్టుపై ధనాధన్ ఆటతీరుతో అదరగొట్టింది. గత కొంత కాలంగా తన ఫామ్ పై వస్తోన్న విమర్శలను సూపర్ ఇన్నింగ్స్ తో సమాధానమిచ్చింది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో భాగంగా శనివారం వెస్టిండీస్ తో టీమిండియా తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు  మంధాన,  యస్తిక భాటియా (21 బంతుల్లో 31; 6 ఫోర్లు) శుభారంభం చేశారు. ముఖ్యంగా యస్తిక ఫోర్లతో విండీస్ బౌలర్లపై చెలరేగింది. వీరిద్దరూ 6.3 ఓవర్లలోనే 49 పరుగులు జోడించారు. అయితే దూకుడు మీదున్న యస్తిక భాటియాను మ్యాథ్యూస్ బోల్తా కొట్టించింది. దాంతో 49 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అయితే అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన మిథాలీ రాజ్ (Mithali Raj) (5) విఫలం కాగా.. దీప్తి శర్మ (15) నిరాశ పరిచింది.

అయితే ఈ దశలో వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (80 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు)తో జతకట్టిన మంధాన స్కోరు బోర్డును పురుగెత్తించింది. తొలుత అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న ఆమె అనంతరం మరింత వేగంగా ఆడింది.  తొలి 50 పరుగులు చేయడానికి మంధానకు 66 బంతులు అవసరం కాగా రెండో ఫిఫ్టీ బాదడానికి కేవలం 42 బంతులే అవసరం అయ్యాయి. మరో ఎండ్ లో ఉన్న హర్మన్ ప్రత్ కూడా చెలరేగడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 40 ఓవర్లలో 3 వికెట్లకు 233 పరుగులు చేసింది.

ప్రపంచకప్ లో ముఖాముఖి రికార్డు

ప్రపంచకప్ ముఖాముఖి రికార్డులో వెస్టిండీస్ పై టీమిండియాకు మరింత ఘనమైన రికార్డు ఉంది. విశ్వ వేదికలపై ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 6 సార్లు తలపడగా... ఆరు సార్లూ టీమిండియా వైపే విజయం చేరింది. 2017లో జరిగిన ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు చివరిసారిగా విశ్వవేదికపై తలపడగా... ఆ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్లకు 183 పరుగులు చేసింది.  స్మృతి మంధాన 108 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను గెలిపించింది.

తుది జట్లు :

టీమిండియా : స్మృతి మంధాన, యష్తికా భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రానా, పూజా వట్సేకర్, జులన్ గో స్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

వెస్టిండీస్ : డాటిన్, హేలీ మ్యాథ్యూస్, కైసియా నైట్,  స్టెఫానీ టేలర్ (కెప్టెన్), క్యాంబెల్లె, చెడీన్ నేషన్, చినెల్లే హెన్రీ, అలియా అలియేని, షమిలా కానెల్, అనిసా మొహమ్మద్, షకేరా సాల్మాన్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India, India Vs Westindies, Mithali Raj, Smriti Mandhana, Team India, World cup

ఉత్తమ కథలు