Home /News /sports /

WOMEN WORLD CUP 2022 AUSTRALIA WOMEN TEAM ALL ROUNDER ASH GARDNER TAKES TWO WORLD CUP FINAL CATCHES SJN

ICC women World Cup: అప్పుడూ... ఇప్పుడూ... రెండు చోట్లా ఈ అమ్మడే... అరుదైన ఘనత సొంతం చేసుకున్న ఆసీస్ క్రికెటర్

యాష్ గార్డ్ నర్ (PC: ICC)

యాష్ గార్డ్ నర్ (PC: ICC)

ICC women World Cup: మహిళల వన్డే ప్రపంచకప్ (World Cup)లో ఆస్ట్రేలియా  మహిళల జట్టు సంచలనం నమోదు చేసింది. అపజయమే లేకుండా సాగుతూ ప్రపంచకప్ ను రికార్డు స్థాయిలో ఏడో సారి సొంతం చేసుకుంది.

ICC women World Cup: మహిళల వన్డే ప్రపంచకప్ (World Cup)లో ఆస్ట్రేలియా  మహిళల జట్టు సంచలనం నమోదు చేసింది. అపజయమే లేకుండా సాగుతూ ప్రపంచకప్ ను రికార్డు స్థాయిలో ఏడో సారి సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 71 పరుగుల తేడాతో ఇంగ్లండ్ (England) మహిళల జట్టుపై ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ యాష్ గార్డ్ నర్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయితే ప్రపంచకప్ ఫైనల్లో ఆమె అటు బంతితో గానీ, ఇటు బ్యాట్ తో గానీ పెద్దగా రాణించలేదు. అయినా సరే అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది. అదేంటో తెలుసుకోవాలంటే చదవండి.

2020లో ఆస్ట్రేలియా వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరిగిన సంగతి తెలిసిందే. అందులో ఫైనల్లో టీమిండియా (Team India)తో ఆస్ట్రేలియా జట్టు తలపడింది. తొలుత ఆసీస్ బ్యాటింగ్ చేయగా... రెండోసారి భారత్ బ్యాటింగ్ చేసింది. తొలుత ఆసీస్ 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. 185 పరుగల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇండియా 99 పరుగులకే ఆలౌటైంది. అయితే ఆ మ్యాచ్ లో చివరి వికెట్ గా అవుటైన పూనమ్ యాదవ్ క్యాచ్ ను యాష్ గార్డ్ నర్ అందుకుంది. మళ్లీ రెండేళ్ల తర్వాత జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి వికెట్ గా అవుటైన అన్యా ష్రుబ్ సోలె కూడా యాష్ గార్డ్ నర్ కే క్యాచ్ ఇచ్చి పెవలియన్ కు చేరింది. అంటే  ఈ రెండు ప్రపంచకప్ ల్లోనూ చాంపియన్ షిప్ విన్నింగ్ క్యాచ్ ను యాష్ గార్డ్ నర్ అందుకుందన్నమాట. దీనినే ఐసీసీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.



357 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టును ఆరంభంలోనే మేగాన్ ష్కుట్ దెబ్బ తీసింది. ఆమె దెబ్బకు ఇంగ్లండ్ ఓపెనర్లు బీమౌంట్ (27), డాని వ్యాట్ (4) తక్కువ పరుగులకే అవుటయ్యారు. ఇక కెప్టెన్ హీథర్ నైట్ (26)ను అలాన్ కింగ్ పెవలియన్ కు చేర్చింది. దాంతో 86 పరుగులకే ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులో ఉన్న నాట్ స్కీవర్ మాత్రం జట్టు విజయం కోసం ఒంటరి పోరాటం చేసింది. అయితే ఆమెకు మిగతా వారి నుంచి సహకారం అందకపోవడంతో ఇంగ్లండ్ కు ఓటమి తప్పలేదు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, England, IPL, IPL 2022, New Zealand, Team India, World cup

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు