Women T20 Challenege : మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో భాగంగా మంగళవారం సూపర్ నోవాస్ (Supernovas), వెలాసిటీ (Velocity) జట్ల మధ్య మ్యాచ్ జరగుతోంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా వెలాసిటీ బౌలర్ మాయా సొనవానే తన వింత బౌలింగ్ యాక్షన్ తో అందరినీ ఆశ్యర్యపరిచింది. బౌలింగ్ చేసే సమయంలో అందరిలా కాకుండా శరీరాన్ని విల్లులా కిందికి వంచి బౌలింగ్ చేసింది. దాంతో ఇదేం బౌలింగ్ రా బాబు అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇక ఐపీఎల్ అధికారిక ఖాతా కూడా ఈ బౌలింగ్ యాక్షన్ కు ఏం పేరు పెడతారు అంటూ ట్వీట్ కూడా చేసింది. మ్యాచ్ లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన మాయా.. 19 పరుగులు ఇచ్చి వికెట్ కూడా తీయలేకపోయింది.
అయితే క్రికెట్ ల ో ఇటువంటి బౌలింగ్ యాక్షన్ కొత్తేమి కాదు. గతంలో ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్ కు ప్రాతినిధ్యం వహించిన కౌశిక్ కూడా ఇటువంటి యాక్షన్ తోనే అందరినీ ఆశ్యర్యపరిచాడు. మాయా బౌలింగ్ యాక్షన్ కౌశిక్ బౌలింగ్ కు దగ్గరగా ఉండటంతో ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ ఖాతా ఫోస్ట్ చేసిన ట్వీట్ కింద కౌశిక్ ఫోటును పెట్టి రీట్వీట్ చేస్తున్నారు.
What do you make of Maya Sonawane's bowling action? 🤔 🤔
Follow the match 👉 https://t.co/ey7pHvLcGi#My11CircleWT20C #SNOvVEL pic.twitter.com/4d5CPZeqWU
— IndianPremierLeague (@IPL) May 24, 2022
We have seen this before. pic.twitter.com/fAjJFJOyQz
— BRAD PITT (@imsubm7) May 24, 2022
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సూపర్ నోవాస్ ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆదుకుంది. ఆమె (51 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్ తో అదరగొట్టింది. దాంతో సూపర్ నోవాస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేయగలిగింది. తానియా భాటియా (32 బంతుల్లో 36; 3 ఫోర్లు), చివర్లో సునె లూస్ (14 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు) రాణిండంతో సూపర్ నోవాస్ ఫైటింగ్ టోటల్ ను వెలాసిటీ జట్టు ముందు ఉంచగలిగింది. వెలాసిటీ బౌలర్లలో కేట్ క్రాస్ రెండు వికెట్లు తీసింది.
టాస్ నెగ్గిన వెలాసిటీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ట్రైల్ బ్లేజర్స్ తో ధాటిగా ఆడిన సూపర్ నోవాస్ ఓపెనర్లు ప్రియా పునియా (4), డాటిన్ (6) ఈ మ్యాచ్ ల ోమాత్రం విఫలం అయ్యారు. హర్లీన్ డియోల్ (7) కూడా నిరాశ పరిచింది. దాంతో సూపర్ నోవాస్ జట్టు 18 పరుగులకే మూడు వికెట్లు నష్టోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశల ోజతకట్టిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, తానియా భాటియా జట్టును ముందుకు నడిపారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 82 పరుగులు జోడించారు. దాంతో సూపర్ నోవాస్ జట్టు 100 మార్కును అందుకుంది. ఇక ధాటిగా ఆడాలనుకునే తరుణంలో లేని పరుగు కోసం ప్రయత్నించిన తానియా భాటియా రనౌట్ అయ్యింది. అయితే మరో ఎండ్ లో ఉన్న హర్మన్ ప్రీత్ మాత్రం వెలాసిటీ బౌలర్లను ఓ ఆట ఆడుకుంది. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్ లోకి పంపి స్కోరు వేగాన్ని పెంచింది. ఈ క్రమంలో ఆమె అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. చివర్లో సునే లూస్ కూడా అదరగొట్టడంతో సూపర్ నోవాస్ 150 పరుగుల మార్కును అందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Mohammed Siraj, Rajasthan Royals, Rashid Khan, Ravichandran Ashwin, Sanju Samson, Smriti Mandhana