Home /News /sports /

WOMEN T20 CHALLENGE VELOCITY BEAT SUPERNOVAS BY 7 WICKETS SJN

Women T20 Challnege : దంచి కొట్టిన లేడీ సెహ్వాగ్.. సూపర్ నోవాస్ పై వెలాసిటీ ఈజీ విక్టరీ

షఫాలీ వర్మ (PC : IPL)

షఫాలీ వర్మ (PC : IPL)

Women T20 Challnege : మహిళల టి20 చాలెంజ్ టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం సూపర్ నోవాస్ (Super Novas)తో జరిగిన మ్యాచ్ లో వెలాసిటీ (Velocity) జట్టు ఈజీ విక్టరీని నమోదు చేసింది.

Women T20 Challnege : మహిళల టి20 చాలెంజ్ టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం సూపర్ నోవాస్ (Super Novas)తో జరిగిన మ్యాచ్ లో వెలాసిటీ (Velocity) జట్టు ఈజీ విక్టరీని నమోదు చేసింది. 151 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వెలాసిటీ జట్టు 18.2 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ షఫాలీ వర్మ (33 బంతుల్లో 51; 9 ఫోర్లు, 1 సిక్స్), లారా వోల్వార్డ్ (35 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ దీప్తి శర్మ (25 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే వెలాసిటీ జట్టు ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది.

స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వెలాసిటీ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నట్టకన్ చంతమ్ (1) తక్కువ స్కోరుకే పెవలియన్ కు చేరుకుంది. అయితే మరో ఓపెనర్, లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ మాత్రం తనదైన శైలిలో రెచ్చిపోయింది. ఆమెకు యస్తిక భాటియా (17) సహకారం అందించింది. అయితే కీలక సమయంలో యస్తిక పెవిలియన్ కు చేరగా.. క్రీజులోకి వచ్చిన లారా షఫాలీ వర్మతో పోటీ పడి మరీ పరుగులు సాధించింది. అర్ధ సెంచరీ తర్వాత షఫాలీ వర్మ అవుట్ అవ్వగా.. దీప్తి శర్మతో కలిసి లారా వెలాసిటీకి గెలుపును అందించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన వెలాసిటీ జట్టుకు 2 పాయింట్లు లభించాయి.

అంతకుమందు తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్ తో అదరగొట్టింది. తానియా భాటియా (32 బంతుల్లో 36; 3 ఫోర్లు), చివర్లో సునె లూస్ (14 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు) రాణిండంతో సూపర్ నోవాస్ ఫైటింగ్ టోటల్ ను వెలాసిటీ జట్టు ముందు ఉంచగలిగింది. వెలాసిటీ బౌలర్లలో కేట్ క్రాస్ రెండు వికెట్లు తీసింది.

ట్రైల్ బ్లేజర్స్ తో ధాటిగా ఆడిన సూపర్ నోవాస్ ఓపెనర్లు ప్రియా పునియా (4), డాటిన్ (6) ఈ మ్యాచ్ ల ోమాత్రం విఫలం అయ్యారు. హర్లీన్ డియోల్ (7) కూడా నిరాశ పరిచింది. దాంతో సూపర్ నోవాస్ జట్టు 18 పరుగులకే మూడు వికెట్లు నష్టోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశల ోజతకట్టిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, తానియా భాటియా జట్టును ముందుకు నడిపారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 82 పరుగులు జోడించారు. దాంతో సూపర్ నోవాస్ జట్టు 100 మార్కును అందుకుంది. ఇక ధాటిగా ఆడాలనుకునే తరుణంలో లేని పరుగు కోసం ప్రయత్నించిన తానియా భాటియా రనౌట్ అయ్యింది. అయితే మరో ఎండ్ లో ఉన్న హర్మన్ ప్రీత్ మాత్రం వెలాసిటీ బౌలర్లను ఓ ఆట ఆడుకుంది. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్ లోకి పంపి స్కోరు వేగాన్ని పెంచింది. ఈ క్రమంలో ఆమె అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. చివర్లో సునే లూస్ కూడా అదరగొట్టడంతో సూపర్ నోవాస్ 150 పరుగుల మార్కును అందుకుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Smriti Mandhana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు