WOMEN T20 CHALLENGE TRAILBLAZERS VS SUPERNOVAS LIVE SCORES TRAILBLAZERS WON THE TOSS AND ELECTED TO BAT FIRST SJN
Womens T20 Challenge : టాస్ నెగ్గిన సూపర్ నోవాస్.. ప్రపంచకప్ క్వీన్ కు తొలిసారి అవకాశం
ట్రైల్ బ్లేజర్స్ వర్సెస్ సూపర్ నోవాస్ (PC : IPL)
Womens T20 Challenge : ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లీగ్ దశ అలరించగా.. నేటి నుంచి మహిళల విభాగంలో జరిగే ఉమెన్ టి20 చాలెంజ్ టోర్నీ అలరించనుంది.
Womens T20 Challenge : ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లీగ్ దశ అలరించగా.. నేటి నుంచి మహిళల విభాగంలో జరిగే ఉమెన్ టి20 చాలెంజ్ టోర్నీ అలరించనుంది. తొలి మ్యాచ్ లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ ట్రైల్ బ్లేజర్స్ (Trailblazers) తో రెండు సార్లు చాంపియన్ సూపర్ నోవాస్ (Super Novas) తలపడనుంది. టాస్ నెగ్గిన హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని సూపర్ నోవాస్ బ్యాటింగ్ ఎంచుకుంది. మహిళల క్రికెట్ కు పాపులారిటీని కల్పించేందుకు బీసీసీఐ 2018 నుంచి కూడా మహిళల విభాగంలో మినీ ఐపీఎల్ ను నిర్వహిస్తూ వస్తోంది. కరోనా వల్ల 2021లో ఈ లీగ్ జరగలేదు. ఆస్ట్రేలియాకు చెందని అలానా కింగ్ తొలిసారి ఈ లీగ్ లో ఆడనుంది. ఆమె సూపర్ నోవాస్ తరఫున ఆడనుంది.
2018లో ఈ టోర్నీ ఆరంభం కాగా.. తొలి ఎడిషన్ లో సూపర్ నోవాస్ విజేతగా నిలిచింది. 2019లో జరిగిన లీగ్ లోనూ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ ఏ విజేతగా నిలవడం విశేషం. అయితే 2020లో జరిగిన టోర్నీలో మాత్రం మంధాన సారథ్యంలోని ట్రైల్ బ్లేజర్స్ గెలుపొందింది.
మే 23న జరిగే తొలి మ్యాచ్ లో ట్రయిల్ బ్లేజర్స్ తో సూపర్ నోవాస్ ఆడుతుంది. మే 24న వెలాసిటీతో సూపర్ నోవాస్, మే 26న ట్రయిల్ బ్లేజర్స్ తో వెలాసిటీ జట్లు ఆడతాయి. ఒక్కో జట్టు రెండు మ్యాచ్ లను ఆడుతుంది. టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య మే 28న ఫైనల్ జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.