WOMEN T20 CHALLENGE TRAILBLAZERS VS SUPERNOVAS LIVE SCORES SUPERNOVAS PUT BIG TOTAL FOR TRAILBLAZERS SJN
Women T20 challenge : దంచి కొట్టిన హర్లీన్ డియోల్.. ట్రైల్ బ్లేజర్స్ ముందు భారీ టార్గెట్..
ట్రైల్ బ్లేజర్స్ (PC : IPL)
Women T20 challenge : మహిళల టి20 చాలెంజ్ టోర్నమెంట్ లో భాగంగా పుణే వేదికగా జరగుతోన్న తొలి మ్యాచ్ లో సూపర్ నోవాస్ (Super Novas) జట్టు భారీ స్కోరు సాధించింది.
Women T20 challenge : మహిళల టి20 చాలెంజ్ టోర్నమెంట్ లో భాగంగా పుణే వేదికగా జరగుతోన్న తొలి మ్యాచ్ లో సూపర్ నోవాస్ (Super Novas) జట్టు భారీ స్కోరు సాధించింది. ట్రైల్ బ్లేజర్స్ (Trailblazers) తో ఆరంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హర్మన్ ప్రీత్ కౌర్ () నాయకత్వంలోని సూపర్ నోవాస్ జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. హర్మన్ ప్రీత్ కౌర్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. హర్లీన్ డియోల్ (19 బంతుల్లో 35; 5 ఫోర్లు) మెరుపులు మెరిపించింది. డాటిన్ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడింది. ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లలో హైలీ మ్యాథ్యూస్ 3 వికెట్లు తీసింది. సల్మా ఖాటున్ 2 వికెట్లు తీసింది. చివరి ఓవర్లలో ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సూపర్ నోవాస్ 200 మార్కును అందుకోలేకపోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సూపర్ నోవాస్ కు ఓపెనర్లు డాటిన్, ప్రియా పునియా (22) శుభారంభం చేశారు. వీరు దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించారు. దాంతో 5 ఓవర్ల లోపే సూపర్ నోవాస్ 50 పరుగుల మార్కును అందుకుంది. అయితే షర్మీన్ అక్తర్ డైరెక్ట్ త్రోకు డాటిన్ రనౌట్ అయ్యి పెవిలియన్ కు చేరుకుంది. అయితే హర్లీన్ డియోల్ క్రీజులోకి వచ్చాక.. సూపర్ నోవాస్ స్కోరు బోర్డు మరింత వేగంగా కదిలింది. 5 ఫోర్లు బాదిన ఆమె వేగంగా పరుగులు సాధించింది. దాంతో పవర్ ప్లేలో సూపర్ నోవాస్ 58 పరుగులు సాధించింది. మిడిల్ ఓవర్లలో సారథి హర్మన్ ప్రీత్ కౌర్ కూడా రాణించడంతో సూపర్ నోవాస్ 200 మార్కును టచ్ చేసేలా కనిపించింది. అయితే డెత్ ఓవర్స్ లో ట్రైల్ బ్లేజర్స్ కమ్ బ్యాక్ చేయడంతో చివరి ఓవర్లలో కేవలం 40 పరుగులు మాత్రమే సాధించడంతో 200 పరుగుల మార్కుకు దూరంగా ఆగిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.