Home /News /sports /

WOMEN T20 CHALLENGE TRAILBLAZERS VS SUPERNOVAS LIVE SCORES SUPERNOVAS BEAT TRAILBLAZERS BY 49 RUNS SJN

Women T20 challenge : అయ్యో స్మృతి మంధాన.. సూపర్ నోవాస్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన ట్రైల్ బ్లేజర్స్

పూజా వస్త్రాకర్ (కుడి) (PC : IPL)

పూజా వస్త్రాకర్ (కుడి) (PC : IPL)

Women T20 challenge : డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మహిళల టి20 చాలెంజ్ టోర్నమెంట్ లో అడుగు పెట్టిన ట్రైల్ బ్లేజర్స్ (Trailblazers)కు తొలి మ్యాచ్ లో దారుణ పరాభవం ఎదురైంది.

Women T20 challenge : డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మహిళల టి20 చాలెంజ్ టోర్నమెంట్ లో అడుగు పెట్టిన ట్రైల్ బ్లేజర్స్ (Trailblazers)కు తొలి మ్యాచ్ లో దారుణ పరాభవం ఎదురైంది. రెండు సార్లు చాంపియన్ సూపర్ నోవాస్ (Super Novas)తో జరిగిన మ్యాచ్ లో స్మృతి మంధాన సారథ్యంలోని ట్రైల్ బ్లేజర్స్ కు భారీ ఓటమి ఎదురైంది. సూపర్ నోవాస్ 49 పరుగుల తేడాతో ట్రైల్ బ్లేజర్స్ పై ఘనవిజయం సాధించింది. 164 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రైల్ బ్లేజర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగుల మాత్రమే చేయగలిగింది. పూజా వస్త్రాకర్ 4 వికెట్లతో ట్రైల్ బ్లేజర్స్ నడ్డి విరిచింది. ఆమెతో పాటు అలాన్ కింగ్, సోఫీ ఎకెల్ స్టోన్ చెరో రెండేసి వికెట్లు తీశారు. ఛేదనలో కెప్టెన్ స్మృతి మంధాన (23 బంతుల్లో 34; 4 ఫోర్లు) జెమీమా రోడ్రిగ్స్ (24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.

భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ట్రైల్ బ్లేజర్స్ కు ఓపెనర్లు  స్మృతి మంధాన, హైలీ మ్యాథ్యూస్ (18) శుభారంభం చేశారు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో బ్లేజర్స్ జట్టు టార్గెట్ వైపు దూసుకెళ్లింది. అయితే బౌలింగ్ కు వచ్చిన పూజా వస్త్రాకర్ మ్యాథ్యూస్ ను అవుట్ చేసి సూపర్ నోవాస్ కు బ్రేక్ ఇచ్చింది. రెండు ఓవర్ల అనంతరం పూజా వస్త్రాకర్ మరోసారి తన సూపర్ బౌలింగ్ తో ఒకే ఓవర్లో డంక్లీ (1), మంధాన వికెట్లను తీసి ట్రైల్ బ్లేజర్స్ ను కోలుకోకుండా చేసింది. ఇక చివరి హోప్ గా ఉన్న జెమీమా రోడ్రిగ్స్ హర్లీన్ డియోల్ పట్టిన అద్భుత క్యాచ్ కు పెవిలియన్ కు చేరడంతో ట్రైల్ బ్లేజర్స్ కథ ముగిసింది.

సూపర్ నోవాస్ జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. హర్మన్ ప్రీత్ కౌర్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. హర్లీన్ డియోల్ (19 బంతుల్లో 35; 5 ఫోర్లు) మెరుపులు మెరిపించింది. డాటిన్ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడింది. ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లలో హైలీ మ్యాథ్యూస్ 3 వికెట్లు తీసింది. సల్మా ఖాటున్ 2 వికెట్లు తీసింది. చివరి ఓవర్లలో ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సూపర్ నోవాస్ 200 మార్కును అందుకోలేకపోయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సూపర్ నోవాస్ కు ఓపెనర్లు డాటిన్, ప్రియా పునియా (22) శుభారంభం చేశారు. వీరు దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించారు. దాంతో 5 ఓవర్ల లోపే సూపర్ నోవాస్ 50 పరుగుల మార్కును అందుకుంది. అయితే షర్మీన్ అక్తర్ డైరెక్ట్ త్రోకు డాటిన్ రనౌట్ అయ్యి పెవిలియన్ కు చేరుకుంది. అయితే హర్లీన్ డియోల్ క్రీజులోకి వచ్చాక.. సూపర్ నోవాస్ స్కోరు బోర్డు మరింత వేగంగా కదిలింది. 5 ఫోర్లు బాదిన ఆమె వేగంగా పరుగులు సాధించింది. దాంతో పవర్ ప్లేలో సూపర్ నోవాస్ 58 పరుగులు సాధించింది.  అయితే డెత్ ఓవర్స్ లో ట్రైల్ బ్లేజర్స్ కమ్ బ్యాక్ చేయడంతో చివరి ఓవర్లలో కేవలం 40 పరుగులు మాత్రమే సాధించడంతో అనుకున్నంత స్కోర్ ను సూపర్ నోవాస్ చేయలేదు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Smriti Mandhana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు