Women T20 Challenge : మహిళల టి20 చాలెంజ్ టోర్నమెంట్ లో భాగంగా పుణే వేదికగా వెలాసిటీ (Velocity) జట్టుతో జరుగుతోన్న మ్యాచ్ లో సూపర్ నోవాస్ (Supernovas) జట్టు భారీ స్కోరును సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్ తో అదరగొట్టింది. దాంతో సూపర్ నోవాస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేయగలిగింది. తానియా భాటియా (32 బంతుల్లో 36; 3 ఫోర్లు), చివర్లో సునె లూస్ (14 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు) రాణిండంతో సూపర్ నోవాస్ ఫైటింగ్ టోటల్ ను వెలాసిటీ జట్టు ముందు ఉంచగలిగింది. వెలాసిటీ బౌలర్లలో కేట్ క్రాస్ రెండు వికెట్లు తీసింది.
టాస్ నెగ్గిన వెలాసిటీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ట్రైల్ బ్లేజర్స్ తో ధాటిగా ఆడిన సూపర్ నోవాస్ ఓపెనర్లు ప్రియా పునియా (4), డాటిన్ (6) ఈ మ్యాచ్ ల ోమాత్రం విఫలం అయ్యారు. హర్లీన్ డియోల్ (7) కూడా నిరాశ పరిచింది. దాంతో సూపర్ నోవాస్ జట్టు 18 పరుగులకే మూడు వికెట్లు నష్టోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశల ోజతకట్టిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, తానియా భాటియా జట్టును ముందుకు నడిపారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 82 పరుగులు జోడించారు. దాంతో సూపర్ నోవాస్ జట్టు 100 మార్కును అందుకుంది. ఇక ధాటిగా ఆడాలనుకునే తరుణంలో లేని పరుగు కోసం ప్రయత్నించిన తానియా భాటియా రనౌట్ అయ్యింది. అయితే మరో ఎండ్ లో ఉన్న హర్మన్ ప్రీత్ మాత్రం వెలాసిటీ బౌలర్లను ఓ ఆట ఆడుకుంది. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్ లోకి పంపి స్కోరు వేగాన్ని పెంచింది. ఈ క్రమంలో ఆమె అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. చివర్లో సునే లూస్ కూడా అదరగొట్టడంతో సూపర్ నోవాస్ 150 పరుగుల మార్కును అందుకుంది.
తుది జట్లు
వెలాసిటీ
దీప్తి శర్మ (కెప్టెన్), షఫాలీ వర్మ, లారో వోల్వర్డ్, యస్తిక భాటియా, నట్టఖాన్ చాంతమ్, కిరణ్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, కేట్ క్రాస్, ఆయబొంగ ఖాఖ, మాయా.
సూపర్‌నోవాస్
డియాండ్రా డోటిన్, ప్రియా పునియా, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), సునే లూస్, హర్లీన్ డియోల్, తానియా భాటియా (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, సోఫీ ఎక్లెస్టోన్, అలనా కింగ్, చందు, మేఘనా సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, IPL 2022, Mithali Raj, Smriti Mandhana