WOMEN T20 CHALLENGE FINAL SNO VS VEL LIVE SCORE UPDATES VELOCITY WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD
Women T20 Challenge Final : ఫైనల్ ఫైట్ లో టాస్ నెగ్గిన వెలాసిటీ.. రెండు మార్పులతో బరిలోకి సూపర్ నోవాస్..
Women T20 Challenge Final
Women T20 Challenge Final : ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 4 సార్లు తలపడగా.. అందులో సూపర్ నోవాస్ రెండు సార్లు, వెలాసిటీ 2 సార్లు విజయం సాధించింది. బలాబలాల పరంగా చూస్తే ఇరు జట్లు కూడా సమవుజ్జీలుగా ఉన్నాయి.
మహిళల విభాగంలో జరుగుతోన్న టి20 చాలెంజ్ టోర్నీలో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. దీప్తి శర్మ (Deepti Sharma) నాయత్వంలోని వెలాసిటీ (Velocity) జట్టు, హర్మన్ ప్రీత్ కౌర్ (Harman preet kaur) సారథ్యంలోని సూపర్ నోవాస్ (SuperNovas) జట్ల మధ్య అంతిమ సమరం జరగనుంది. పుణే వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది వెలాసిటీ జట్టు. ఇక, ఈ మ్యాచులో వెలాసిటీ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంటే.. సూపర్ నోవాస్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మాన్షి జోషి, రాశి ల్ని తుది జట్టులోకి తీసుకుంది.లీగ్ స్టేజ్ లో ఈ రెండు జట్లు తలపడగా వెలాసిటీ జట్టు విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగు పెట్టిన స్మృతి మంధాన నాయకత్వంలోని ట్రైల్ బ్లేజర్స్ (Trailblazers) ఈసారి ఫైనల్ కు చేరుకోలేకపోయింది.
మిథాలీ రాజ్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన దీప్తి.. అంచనాలకు మించి రాణిస్తోంది. కెప్టెన్ గా చక్కటి వ్యూహాలు ప్రదర్శిస్తూ తన టీంను ఫైనల్ కు తీసుకొచ్చింది. 2019 సీజన్ లో వెలాసిటీ జట్టు ఫైనల్ చేరినా అక్కడ సూపర్ నోవాస్ చేతిలో ఓడిపోయింది. దాంతో ఈసారి ఎలాగైనా గెలిచి ఉమెన్ టి20 చాలెంజ్ ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో వెలాసిటీ కనిపిస్తోంది.
వెలాసిటీ జట్టులో ఓపెనర్ గా షఫాలీ వర్మ కీలకం కానుంది. వీరేంద్ర సెహ్వాగ్ లా ధాటిగా ఆడగల సత్తా ఆమె సొంతం. దాంతో ఆమెను లేడీ సెహ్వాగ్ అని కూడా పిలుస్తారు. ఇక, మరో యంగ్ బ్యాటర్ కిరణ్ ట్రైల్ బ్లేజర్స్ తో జరిగిన మ్యాచులో తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపింది. ఇక, లారా వోల్వార్డ్, యస్తిక భాటియా, దీప్తి శర్మ వంటి టాప్ క్లాస్ ప్లేయర్లు వెలాసిటీ జట్టు సొంతం. బౌలింగ్ లో కేట్ క్రాస్, ఖాఖ, రాధా యదవ్, స్నేహ్ రాణ్ కీలకం కానున్నారు.
సూపర్ నోవాస్ జట్టుకు ఇది నాలుగో ఫైనల్ కావడం విశేషం. ఆడిన ప్రతి సీజన్ లోనూ సూపర్ నోవాస్ తుది పోరుకు అర్హత సాధించింది. అంతేకాకుండా తొలి రెండు సీజన్లలోనూ చాంపియన్ గా నిలిచింది. ఈసారి కూడా ఫైనల్లో విజయం సాధించి మూడోసారి ఉమెన్ టి20 చాలెంజ్ ట్రోఫీని ముద్దాడాలని చూస్తోంది. డాటిన్, హార్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ వంటి హార్ట్ హిట్టర్లు సూపర్ నోవాస్ సొంతం. పూజా వస్త్రాకర్, అలాన్ కింగ్, సోఫి ఎక్ లెస్టోన్ బౌలింగ్ లో కీలకం కానున్నారు.
ముఖాముఖి రికార్డు
ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 4 సార్లు తలపడగా.. అందులో సూపర్ నోవాస్ రెండు సార్లు, వెలాసిటీ 2 సార్లు విజయం సాధించింది. బలాబలాల పరంగా చూస్తూ ఇరు జట్లు కూడా సమవుజ్జీలుగా ఉన్నాయి. పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.