Home /News /sports /

WOMEN T20 CHALLENGE FINAL SNO VS VEL LIVE SCORE UPDATES SUPERNOVAS WON BY 4 RUNS AND BAGS CHAMPIONSHIP SRD

Women T20 Challenge Final : ఉత్కంఠ పోరులో సూపర్ నోవాస్ దే విక్టరీ.. మూడోసారి టైటిల్ కైవసం.. లారా పోరాటం వృధా..

Supernovas (IPL Twitter)

Supernovas (IPL Twitter)

Women T20 Challenge Final : ఫైనల్ పోరులో వెలాసిటీ, సూపర్ నోవాస్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయ్. ఆఖరి వరకు జరిగిన ఈ పోరులో ఆఖరికి విజయం సూపర్ నోవాస్ ని వరించింది.

    వాటే మ్యాచ్. మహిళల ఐపీఎల్ ఫైనల్ లో రెండు జట్లు విజయం కోసం హోరాహోరీగా తలపడ్డాయ్. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ పోరులో చివరికి విజయం సూపర్ నోవాస్ ని వరించింది. 166 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెలాసిటీ 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 4 పరుగుల తేడాతో సూపర్ నోవాస్ విక్టరీ కొట్టింది. లారా వొల్వార్డ్ ( 40 బంతుల్లో 64 పరుగులు నాటౌట్ ; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆఖర్లో సిమ్రాన్ (10 బంతుల్లో 20 పరుగులు ; 3 ఫోర్లు, 1సిక్సర్) మెరుపులు మెరిపించింది . అలాన్ కింగ్ మూడు వికెట్లతో దుమ్మురేపింది. డాటిన్, సోఫి ఎక్ లిస్టన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక, మహిళల టీ20 ఛాలెంజర్ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తోంది సూపర్ నోవాస్. ముచ్చటగా మూడో సారి కప్పును ఎగరేసుకుపోయింది హర్మన్ ప్రీత్ సేన. 166 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెలాసిటీకి మంచి ఆరంభమే లభించింది. అయితే.. ఆ ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. షఫాలీ, యస్తికా భాటియాల దూకుడుకు ఫస్ట్ రెండు ఓవర్లలోనే 29 పరుగులు చేసింది వెలాసిటీ. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న షఫాలీని (15) డాటిన్ పెవిలియన్ బాట పట్టించింది. కీపర్ కి క్యాచ్ ఇచ్చి ఔటైంది షఫాలీ.

    ఇక, అక్కట్నుంచి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది వెలాసిటీ. వరల్డ్ నెం.1 స్పిన్నర్ సోఫీ ఎక్ లిస్టన్ స్వల్ప విరామంలో యస్తికా (13), కిరణ్(0) ల్ని పెవిలియన్ బాట పట్టించింది. ఆ తర్వాత నట్టకన్ చంతమ్ (6).. పూజా బౌలింగ్ ఎల్బీగా వెనుదిరింది. దీంతో.. 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది వెలాసిటీ జట్టు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ దీప్తి శర్మ (2) కూడా నిరాశపర్చింది. దీప్తిని అలానా కింగ్ ఔట్ చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్ లో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ లార్ వోల్వార్డ్ మాత్రం తన దూకుడు ఆపలేదు. స్నేహ్ రాణాతో కలిసి 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.


    అయితే.. స్నేహ్, రాధా యాదవ్ లు అలానా కింగ్ వేసిన ఓకే ఓవర్ లో పెవిలియన్ బాట పట్టారు. దీంతో.. 104 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రాస్ 13 పరుగులు చేసి డాటిన్ బౌలింగ్ లో తానియాకి క్యాచ్ ఇచ్చి ఔటైంది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా.. లారా మాత్రం తన సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంది.

    ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇక, ఆఖర్లో సిమ్రన్, లారా ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆఖరి రెండు ఓవర్లలో 34 పరుగులు అవసరమవ్వగా.. 19వ ఓవర్ లో ఏకంగా 17 పరుగులు చేసింది వెలాసిటీ. దీంతో.. ఆఖరి ఓవర్ లో 17 పరుగులు అవసరమయ్యాయ్. సోఫి వేసిన 20 వ ఓవర్ ఫస్ట్ బంతికే సిక్సర్ కొట్టింది లారా. అయితే.. వరల్డ్ నెం.1 బౌలర్ తన అనుభవాన్ని అంతా ఉపయోగించింది పరుగులు రాకుండా కట్టడి చేసింది.

    అంతకుముందు డాటిన్, హర్మన్ మెరుపులతో సూపర్ నోవాస్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. డాటిన్ (44 బంతుల్లో 62 పరుగులు ; 1 ఫోర్, 4 సిక్సర్లు), హర్మన్ ప్రీత్ ( 29 బంతుల్లో 43 పరుగులు ; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. వెలాసిటీ బౌలర్లలో దీప్తి శర్మ, కేట్ క్రాస్, సిమ్రన్ తలా రెండు వికెట్లతో సత్తా చాటారు. ఖాఖ ఒక వికెట్ దక్కించుకుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IPL 2022, Women T20 Challenge, Women's Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు