Home /News /sports /

WOMEN T20 CHALLENGE FINAL SNO VS VEL LIVE SCORE UPDATES SUPERNOVAS SET FIGHTING TOTAL ON SCORE BOARD SRD

Women T20 Challenge Final : డాటిన్, హర్మన్ దంచెన్.. దీప్తి, క్రాస్ మెరిసెన్.. వెలాసిటీ టార్గెట్ ఇదే..

Dottin (IPL Twitter)

Dottin (IPL Twitter)

Women T20 Challenge Final : ఫైనల్ పోరులో సూపర్ నోవాస్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. ఓ దశలో భారీ స్కోరు దిశగా సాగిన సూపర్ నోవాస్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. వెలాసిటీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు.

    పుణె వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఛాలెంజర్ టోర్నీ ఫైనల్ లో సూపర్ నోవాస్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. డాటిన్ (44 బంతుల్లో 62 పరుగులు ; 1 ఫోర్, 4 సిక్సర్లు), హర్మన్ ప్రీత్ ( 29 బంతుల్లో 43 పరుగులు ; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. వెలాసిటీ బౌలర్లలో దీప్తి శర్మ, కేట్ క్రాస్, సిమ్రన్ తలా రెండు వికెట్లతో సత్తా చాటారు. ఖాఖ ఒక వికెట్ దక్కించుకుంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన సూపర్ నోవాస్ జట్టుకు ఓపెనర్లు డాటిన్, ప్రియా పునియా మంచి ఆరంభం అందించారు. ప్రియా పునియా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభిస్తే.. డాటిన్ తనదైన స్టైల్ లో రెచ్చిపోయింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోయింది. ప్రియా కూడా అడపా దడపా బౌండరీలతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

    అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సిమ్రాన్ విడదీసింది. 28 పరుగులు చేసిన ప్రియా.. లారా వోల్వార్డ్ కి క్యాచ్ ఇచ్చి ఔటైంది. దీంతో, 73 పరుగులకు ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత డాటిన్ కి తోడైన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా మెరుపులు మెరిపించింది. ఈ ఇద్దరూ ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో డాటిన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే.. డాటిన్ జోరుకు ప్రత్యర్ధి జట్టు కెప్టెన్ దీప్తి బ్రేకులు వేసింది.

    62 పరుగులు చేసిన డాటిన్ దీప్తి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయింది. ఇక, ఇక్కట్నుంచి సూపర్ నోవాస్ ఇన్నింగ్స్ పై పట్టు కోల్పోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. పూజా (5).. ఖాఖ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయింది. ఆ వెంటనే హర్మన్ 43 పరుగులు చేసి కేట్ క్రాస్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టింది. ఆ వెంటనే సోఫి (2) కేట్ క్రాస్ బౌలింగ్ లో ఔటవ్వగా.. సునే లూస్ (3) దీప్తి శర్మ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టింది. దీంతో.. 155 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఓ దశలో 180 పరుగులకు పైగా సాగిన సూపర్ నోవాస్ ఇన్నింగ్స్ ఆఖర్లో తడబడింది. చివరికి ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగుల ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది.

    ముఖాముఖి రికార్డు

    ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 4 సార్లు తలపడగా.. అందులో సూపర్ నోవాస్ రెండు సార్లు, వెలాసిటీ 2 సార్లు విజయం సాధించింది. బలాబలాల పరంగా చూస్తూ ఇరు జట్లు కూడా సమవుజ్జీలుగా ఉన్నాయి. పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.

    తుది జట్లు

    సూపర్ నోవాస్

    ప్రియా పునియా, డాటిన్, హర్లీన్ డియోల్, తానియా భాటియా, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), సునే లూస్, పూజా వస్త్రాకర్, అలానా కింగ్, సోఫీ ఎక్ లెస్టోన్, మాన్షి జోషి, రాశి కనోజియా

    వెలాసిటీ

    షఫాలీ వర్మ, యస్తిక భాటియా, కిరణ్ నవ్ గిరే, లారా వోల్వార్డ్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్, సిమ్రన్ బహదూర్, కేట్ క్రాస్, నట్టకన్ చంతమ్, అయబోనా ఖాఖ
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IPL 2022, Women T20 Challenge, Women's Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు