Women T20 Challenge : మహిళల టి20 చాలెంజ్ టోర్నమెంట్ లో నేడు సూపర్ నోవాస్ (Supernovas), వెలాసిటీ (Velocity) జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ట్రైల్ బ్లేజర్స్ (Trailblazrers) తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని సూపర్ నోవాస్.. నేటి మ్యాచ్ లోనూ విజయం సాధిస్తే ఫైనల్ కు చేరుకోనుంది. టాస్ నెగ్గిన వెలాసిటీ జట్టు కెప్టెన్ దీప్తి శర్మ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం వెలాసిటీ జట్టు ఐదుగురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు, ముగ్గురు బౌలర్లతో బరిలోకి దిగనున్నట్లు పేర్కొంది. ఇక ట్రైల్ బ్లేజర్స్ పై నెగ్గిన సూపర్ నోవాస్ ఈ మ్యాచ్ కోసం ఎటువంటి మార్పలు చేయలేదు.
సోమవారం ట్రైల్ బ్లేజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 49 పరుగుల తేడాతో గెలిచిన సూపర్ నోవాస్ జట్టు దాదాపుగా ఫైనల్ ప్లేస్ ను ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే నేడే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. ఇక గత మూడు సీజన్లలోనూ వెలాసిటీకి కెప్టెన్ గా మిథాలీ రాజ్ వ్యవహరించింది. అయితే ఈ సీజన్ నుంచి మాత్రం ఆమె తప్పుకుంది. దాంతో దీప్తి శర్మ కెప్టెన్ గా ప్రమోట్ అయ్యింది. వెలాసిటీ జట్టు ఓపెనర్ గా షఫాలీ వర్మ కీలకం కానుంది. వీరేంద్ర సెహ్వాగ్ లా ధాటిగా ఆడగల సత్తా ఆమె సొంతం. దాంతో ఆమెను లేడీ సెహ్వాగ్ అని కూాడా పిలుస్తారు.
మే 23న జరిగే తొలి మ్యాచ్ లో ట్రయిల్ బ్లేజర్స్ తో సూపర్ నోవాస్ ఆడుతుంది. మే 24న వెలాసిటీతో సూపర్ నోవాస్, మే 26న ట్రయిల్ బ్లేజర్స్ తో వెలాసిటీ జట్లు ఆడతాయి. ఒక్కో జట్టు రెండు మ్యాచ్ లను ఆడుతుంది. టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య మే 28న ఫైనల్ జరగనుంది.
తుది జట్లు
వెలాసిటీ
దీప్తి శర్మ (కెప్టెన్), షఫాలీ వర్మ, లారో వోల్వర్డ్, యస్తిక భాటియా, నట్టఖాన్ చాంతమ్, కిరణ్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, కేట్ క్రాస్, ఆయబొంగ ఖాఖ, మాయా.
సూపర్నోవాస్
డియాండ్రా డోటిన్, ప్రియా పునియా, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), సునే లూస్, హర్లీన్ డియోల్, తానియా భాటియా (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, సోఫీ ఎక్లెస్టోన్, అలనా కింగ్, చందు, మేఘనా సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Mithali Raj, Mohammed Siraj, Rajasthan Royals, Rashid Khan, Sanju Samson, Smriti Mandhana