WOMEN T20 CHALLENG VELOCITY VS SUPERNOVAS LIVE SCORE MATCH PREVIEW PREDICTED XI HEAD TO HEAD SJN
Women T20 Challenge : సివంగుల సమరానికి అంతా సిద్ధం.. తాడో పేడో తేల్చుకోనున్న హర్మన్, దీప్తి.. తుది జట్లు ఇవే
హర్మన్ వర్సెస్ దీప్తి (ఫైల్ ఫోటో)
Women T20 Challenge : మహిళల విభాగంలో జరుగుతోన్న టి20 చాలెంజ్ టోర్నీలో నేడు ఫైనల్ సమరం జరగనుంది. దీప్తి శర్మ (Deepti Sharma) నాయత్వంలోని వెలాసిటీ (Velocity) జట్టు, హర్మన్ ప్రీత్ కౌర్ (Harman preet kaur) సారథ్యంలోని సూపర్ నోవాస్ (SuperNovas) జట్ల మధ్య పుణే వేదికగా నేడు అంతిమ సమరం జరగనుంది.
Women T20 Challenge : మహిళల విభాగంలో జరుగుతోన్న టి20 చాలెంజ్ టోర్నీలో నేడు ఫైనల్ సమరం జరగనుంది. దీప్తి శర్మ (Deepti Sharma) నాయత్వంలోని వెలాసిటీ (Velocity) జట్టు, హర్మన్ ప్రీత్ కౌర్ (Harman preet kaur) సారథ్యంలోని సూపర్ నోవాస్ (SuperNovas) జట్ల మధ్య పుణే వేదికగా నేడు అంతిమ సమరం జరగనుంది. లీగ్ స్టేజ్ లో ఈ రెండు జట్లు తలపడగా వెలాసిటీ జట్టు విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగు పెట్టిన స్మృతి మంధాన నాయకత్వంలోని ట్రైల్ బ్లేజర్స్ (Trailblazers) ఈసారి ఫైనల్ కు చేరుకోలేకపోయింది. సూపర్ నోవాస్ జట్టుకు ఇది నాలుగో ఫైనల్ కావడం విశేషం. ఆడిన ప్రతి సీజన్ లోనూ సూపర్ నోవాస్ తుది పోరుకు అర్హత సాధించింది. అంతేకాకుండా తొలి రెండు సీజన్లలోనూ చాంపియన్ గా నిలిచింది. ఈసారి కూడా ఫైనల్లో విజయం సాధించి మూడోసారి ఉమెన్ టి20 చాలెంజ్ ట్రోఫీని ముద్దాడాలని చూస్తోంది.
మిథాలీ రాజ్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన దీప్తి.. అంచనాలకు మించి రాణిస్తోంది. కెప్టెన్ గా చక్కటి వ్యూహాలు ప్రదర్శిస్తూ తన టీంను ఫైనల్ కు తీసుకొచ్చింది. 2019 సీజన్ లో వెలాసిటీ జట్టు ఫైనల్ చేరినా అక్కడ సూపర్ నోవాస్ చేతిలో ఓడిపోయింది. దాంతో ఈసారి ఎలాగైనా గెలిచి ఉమెన్ టి20 చాలెంజ్ ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో వెలాసిటీ కనిపిస్తోంది.
ముఖాముఖి రికార్డు
ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 4 సార్లు తలపడగా.. అందులో సూపర్ నోవాస్ రెండు సార్లు, వెలాసిటీ 2 సార్లు విజయం సాధించింది. బలాబలాల పరంగా చూస్తూ ఇరు జట్లు కూడా సమవుజ్జీలుగా ఉన్నాయి. పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.