హోమ్ /వార్తలు /క్రీడలు /

Womens Day 2020 | అవార్డులు కాదు... అదే నాకు అసలైన కిక్: పీవీ సింధు

Womens Day 2020 | అవార్డులు కాదు... అదే నాకు అసలైన కిక్: పీవీ సింధు

పీవీ సింధు (File)

పీవీ సింధు (File)

International Womens Day 2020 | ‘మొద‌ట మ‌హిళ అనే భావ‌న అందరిలో పోవాలి. ముఖ్యంగా మ‌హిళ‌ల్లో. ప్ర‌పంచంలో మ‌హిళ‌లు అన్నింట్లో స‌గం ఉన్నారు. ఎందులోనూ మ‌హిళలు త‌క్కువ కాదు.’ అని పీవీ సింధు అన్నారు.

  పీవీ సింధు. బ‌హుశా ప్ర‌పంచంలో ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రేమో. అంతలా ప్ర‌పంచ‌ంపై ముద్ర వేసిందా పేరు. తెలుగు వాళ్ల ఘ‌న‌త‌ను ప్ర‌పంచ‌వ్యాప్తం చేసిన పేరు. ఆడపిల్ల పుడితే పీవీ సింధూ స్థాయికి వెళ్ల‌ల‌మ్మా అని దీవించే స్థాయిలో నిలిచింది. ఇర‌వై ఐదు ఏళ్లు నిండకుండానే ఎంద‌రో మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోన్న పీవీ సింధూ ప్రపంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా న్యూస్18‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. మ‌హిళ అనే చిన్న చూపు తొలుత మ‌హిళల్లోనే పోవాల‌ని అంటున్న పీవీ సింధు స‌క్సెస్ వెనుక ఎత్తుప‌ల్లాలు క‌ష్ట‌న‌ష్టాలు చాలానే ఉన్నాయి.

  పీవీ సింధు

  పీవీ సింధు పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. జూలై 5, 1995 న పీవీ రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించింది. త‌ల్లిదండ్రులకు కూడా చిన్న‌ప్ప‌టి నుంచి క్రీడ‌ల‌పై ఆస‌క్తి ఉంది. వాలీబాల్ క్రీడాకారులుగా మంచి గుర్తింపు పొందారు. ఏ త‌ల్లిదండ్రులైనా తాము ఏ రంగంలో ఉంటే పిల్ల‌లు కూడా అదే రంగంలో ఉండాల‌ని కొరుకుంటారు. ముఖ్యంగా క్రీడాకారులైతే ఆ విష‌యం చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కానీ పీవీ సింధు త‌ల్లిదండ్రులు ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరించారు. బ‌హుశా అదే ఇప్పుడు తనను ఈ స్థాయిలో నిల‌బెట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మైంద‌ని చెబుతారు సింధు. త‌ల్లి దండ్రులు స్వత‌హాగా వాలీబాట్ క్రీడాకారులైన‌ప్ప‌టికి పీవీ సింధుపై అది రుద్దే ప్ర‌యత్నం చేయ‌లేదు.

  తండ్రి పీవీ రమణతో సింధు

  చిన్న‌ప్ప‌టి నుంచి సింధు ఏ క్రీడను ఇష్ట‌ప‌డుతుందో తెలుసుకొని అందులోనే శిక్ష‌ణ ఇవ్వ‌డానికి కృషి చేశారు. సింధు చిన్న‌నాటి నుంచి బ్యాడ్మింటన్ పై ఆస‌క్తి చూపించారు. పుల్లలె గోపీచంద్ ఆటతో స్ఫూర్తి పొంది త‌న ఎనిమిదేళ్ల వ‌య‌స్సులోనే బ్యాడ్మింట‌న్ ఆడ‌డం ప్రారంభించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సింధు ప్ర‌తి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు పుల్లెల గోపీచంద్. 2012లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య వెల్ల‌డించిన‌ ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ఒక్క‌సారిగా ప్ర‌పంచ దృష్టిని ఆకర్షించారు.

  తల్లి పీ.విజయతో సింధు

  అక్క‌డితో ఆగిపోకుండా 2013 ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్ లో తొలి ప‌తకం సాధించిన త‌రువాత ప్ర‌పంచ బ్యాడ్మింటన్ వేదిక‌పై త‌నదైన ముద్ర వేశారు. ఇదే కాకుండా ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్ లో ప‌త‌కం గెలుచుకున్న తొలి భార‌తీయురాలిగా కూడా రికార్డు న‌మోదు చేశారు. అప్పుడు మొద‌లైన సింధు ప్ర‌స్థానం ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడాకారుల్లో అత్య‌ధికంగా పెయిడ్ స్పోర్ట్స్ పర్సన్‌గా సింధు రికార్డు న‌మోదు చేశారు. అయితే త‌న విజ‌యాల వెనుక త‌ల్లిదండ్రుల ప్రొత్సాహ‌మే ఎక్కువ అంటారు సింధు. చిన్న‌ప్ప‌టి నుంచి ఓ వైపు చ‌దువు మ‌రోవైపు క్రీడలను బ్యాలెన్స్ చేసుకోవ‌డంలో త‌ల్లిదండ్రులు ఇచ్చిన ప్రొత్సాహం చాలా ఎక్క‌ువని అంటారు.

  కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పీవీ సింధు

  మొద‌ట మ‌హిళ అనే భావ‌న అందరిలో పోవాలి. ముఖ్యంగా మ‌హిళ‌ల్లో. ప్ర‌పంచంలో మ‌హిళ‌లు అన్నింట్లో స‌గం ఉన్నారు. ఎందులోనూ మ‌హిళలు త‌క్కువ కాదు. ఈప‌ని మ‌హిళలు చేయ‌లేరనేది ఏం లేదు. కాబ‌ట్టి మ‌హిళ అనే భావ‌న మొద‌ట పోతే మ‌నం స‌గం విజ‌యం సాధించిన‌ట్లే. నా మొట్ట‌మెద‌టి గెల‌పు ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తీది చాలా గొప్ప ఫీలింగ్ ను నాకు ఇచ్చాయి. అయిన‌ప్ప‌టికీ ఇంకా దేశానికి చాలా ప‌త‌కాలు తీసుకురావాలి నేను”. అని న్యూస్ 18 కి మ‌హిళ దినోత్స‌వం సంద‌ర్బంగా సంప్ర‌దించిన‌ప్పుడు చెప్పారామె.

  పీవీ సింధు

  పీవీ సింధుకు ఇప్ప‌టి వ‌ర‌కు చాలా అవార్డులు రివార్డు వ‌చ్చాయి. అందులో ముఖ్యంగా భారత ప్రభుత్వం అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారం, అర్జున అవార్డులు ఆమెను వ‌రించాయి. అయితే అవార్డులు, రివార్డుల కంటే మన దేశ జెండాను విజేతగా నిల‌ప‌డంలో త‌న‌కు మంచి కిక్కు ఉందంటారామె.

  ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన సందర్భలో పీవీ సింధు

  “త్వరలో జరగబోయే టోర్న‌మెంట్స్ కి చాలా ప్రిపేర్ అవుతున్నా. దేశం నాపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోవ‌డానికి నా వంతు ప్ర‌య‌త్నాలు చేస్తా. ఇందుకు కఠోర శ్ర‌మ అవ‌స‌రం. ప్ర‌స్తుతం కోచ్ ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌న్న‌ద్ద‌మ‌వుతున్నా. రాబోయే టోర్న‌మెంట్స్ లో మంచి విజ‌యాన్ని న‌మోదు చెస్తాన‌నే న‌మ్మ‌కం చాలా ఉంది.” అన్నారు సింధు.

  (ఎం.బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Pv sindhu, Womens Day 2020

  ఉత్తమ కథలు