• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • WOMEN IPL SCHEDULE TO BE RELEASED BCCI APEX COMMITTEE TO DISCUSS ON CHALLENGE T20 JNK

IPL 2021 : మహిళల ఐపీఎల్‌లో మళ్లీ మూడు జట్లేనా? ఎప్పుడు, ఎక్కడ నిర్వహించనున్నారు?

IPL 2021 : మహిళల ఐపీఎల్‌లో మళ్లీ మూడు జట్లేనా? ఎప్పుడు, ఎక్కడ నిర్వహించనున్నారు?

ఐపీఎల్ ప్లేఆప్స్ జరిగే సమయంలోనే మహిళల టీ20 చాలెంజ్ టోర్నీ నిర్వహించే అవకాశం ఉన్నది. [PC:BCCI}

  • Share this:
    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL 2021) ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే. పలు దేశాలకు చెందిన స్టార్ ప్లేయర్లు, అంతర్జాతీయ క్రికెటర్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ అందరూ కలసి ఒకే వేదికపై క్రికెట్ ఆడటం అదొకొ అద్భుతమైన అనుభూతి. బీసీసీఐకి (BCCI) కాసుల పంట పండిస్తున్న ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను నిరాటంకంగా 14 సీజన్ల నుంచి నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశంలో మహిళల క్రికెట్‌కు కూడా ఆదరణ పెంచాలనే ఉద్దేశంలో ఎప్పటి నుంచో వారి కోసం కూడా ఐపీఎల్ నిర్వహించాలనే ప్రతిపాదన ఉన్నది. ఆస్ట్రేలియాలో మహిళల బిగ్ బాష్ లీగ్ (బీబీఎస్) సూపర్ హిట్ అవడంతో మహిళా ఐపీఎల్‌పై బీసీసీఐ ఆసక్తి చూపించింది. ఇందుకు ట్రయల్స్ అన్నట్లుగా గత కొన్ని సీజన్లుగా మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీని (Women Challenge T20) నిర్వహిస్తున్నది. ప్రస్తుతం దీన్నే మహిళా ఐపీఎల్‌గా పిలుస్తున్నా.. ఇది కేవలం ప్రయోగాత్మక లీగ్ మాత్రమే అని బీసీసీఐ గతంలోనే ప్రకటించింది. 2020 నుంచే పూర్తి స్థాయిలో మహిళా ఐపీఎల్ నిర్వహించడానికి బోర్డు కసరత్తు చేసింది. కానీ కరోనా కారణంగా టీ20 చాలెంజ్ టోర్నీనే కొనసాగించింది. ఈ ఏడాది కూడా కరోనా ప్రభావం తగ్గకపోవడంతో పూర్తి స్థాయి మహిళా ఐపీఎల్ నిర్వహణను వాయిదా వేసినట్లు తెలుస్తున్నది.

    ప్రతీ ఏడాది ఐపీఎల్ ప్లేఆఫ్స్ జరిగే సమయంలోనే మహిళల ఛాలెంజ్ టోర్నీని నిర్వహించే వారు. మరి ఈ ఏడాది ఏ సమయంలో, ఎక్కడ టోర్నీ నిర్వహించాలనే విషయంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ బేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 16న బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పూర్తిగా మహిళా క్రికెట్‌పైనే చర్చ జరుగనున్నది. ప్రస్తుతానికి మహిళల చాలెంజ్ టీ20 టోర్నీలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని సమాచారం. గత సీజన్ మాదిరే మూడు జట్లతో చాలెంజ్ టోర్నీ నిర్వహించే అవకాశం ఉన్నది. అయితే ఈ సారి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ క్రికెటర్లు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గత సీజన్‌ జరిగే సమయంలోనే ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ జరుగుతున్నది. దీంతో చాలా మంది స్టార్ క్రికెటర్లు మహిళల చాలెంజ్ టోర్నీకి దూరమయ్యారు.

    2018 నుంచి బీసీసీఐ నిర్వహిస్తున్న మహిళల చాలెంజ్ టీ20 టోర్నీలో మూడు జట్లు పాల్గొంటున్నాయి. సూపర్ నోవాస్ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్, ట్రయల్‌బ్లేజర్స్ జట్టుకు స్మృతి మంధాన, వెలాసిటీ జట్టుకు మిథాలీ రాజ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లలో రెండు సార్లు సూపర్‌నోవాస్, ఒక సారి ట్రయల్‌బ్లేజర్స్ జట్లు చాలెంజ్ టోర్నీని గెలుచుకున్నాయి. గత ఏడాది మ్యాచ్‌లు అన్నీ షార్జా క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ ఏడాది కూడా ప్లేఆఫ్స్ సమయంలో ఈ టోర్నీ నిర్వహించే అవకాశం ఉన్నది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ అన్నీ అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీంతో చాలెంజ్ టోర్నీ కూడా అక్కడే జరుగుతుందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
    Published by:John Naveen Kora
    First published: