హోమ్ /వార్తలు /క్రీడలు /

Women's IPL 2023 : వయాకామ్18 చేతికి మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్.. ఐదేళ్లకు గానూ ఎంత రేటు పలికిందంటే?

Women's IPL 2023 : వయాకామ్18 చేతికి మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్.. ఐదేళ్లకు గానూ ఎంత రేటు పలికిందంటే?

Trailblazers (IPL Twitter)

Trailblazers (IPL Twitter)

Women's IPL 2023 : ఈ ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ (Women'sIPL)ను బీసీసీఐ (BCCI) ఆరంభించనున్న సంగతి తెలిసిందే. ఐదు జట్లతో ఈ లీగ్ జరిగే అవకాశం ఉంది. అయితే దీనిపై ఈ నెల 23న స్పష్టత రానుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Women's IPL 2023 : ఈ ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ (Women'sIPL)ను బీసీసీఐ (BCCI) ఆరంభించనున్న సంగతి తెలిసిందే. ఐదు జట్లతో ఈ లీగ్ జరిగే అవకాశం ఉంది. అయితే దీనిపై ఈ నెల 23న స్పష్టత రానుంది. ఇంకా జట్లను ఖరారు చేయకముందే మహిళల ఐపీఎల్ జాక్ పాట్ కొట్టేసింది. 2023 నుంచి 2027 వరకు మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్ ను వయాకామ్ 18 సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రూ. 951 కోట్లను బీసీసీఐకి చెల్లించనుంది. గతేడాది పురుషుల ఐపీఎల్ మీడియా రైట్స్ రూ. 48 వేల కోట్ల ధర పలికిన సంగతి తెలిసిందే. పురుషుల మీడియా రైట్స్ తో పోలిస్తే మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్ తక్కువ ధరే పలికింది. అయినప్పటికీ తొలిసారే ఈ మొత్తాన్ని సాధించిందంటే గ్రేట్ అనే చెప్పాలి.

పురుషుల ఐపీఎల్ మీడియా రైట్స్ ను మూడు సంస్థలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టీవీ రైట్స్ ను డిస్నీ స్టార్.. డిజిటల్ రైట్స్ ను వయాకామ్ 18, ఇతర దేశాల్లో ప్రసారం చేసే రైట్స్ ను టైమ్స్ ఇంటర్నెట్ సొంతం చేసుకుంది. అయితే మహిళల ఐపీఎల్ రైట్స్ ను మాత్రం ఒక్క వయాకామ్ 18నే సొంతం చేసుకుంది. ఇందులోనే టీవీ, డిజిటల్, గ్లోబల్ రైట్స్ ఉన్నాయి. ఒక్కో మ్యాచ్ కు రూ. 7.09 కోట్లను వయాకామ్ బీసీసీఐకి చెల్లించనుంది. ఈ విషయాన్ని జై షా తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు.

మొదటి మూడేళ్ల (2023 నుంచి 2025) వరకు సీజన్ కు 22 మ్యాచ్ ల చొప్పున మహిళల ఐపీఎల్ ను నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం సీజన్ కు 34 చొప్పున జరిపే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఐపీఎల్ జట్ల కోసం బీసీసీఐ బిడ్స్ ఆహ్వానించింది. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ , పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ బిడ్డింగ్ పత్రాలను దాఖలు చేసినట్లు తెలుస్తుంది. జనవరి 23 బిడ్స్ కు ఆఖరి తేది.

First published:

Tags: Bcci, IPL, Smriti Mandhana, Viacom18

ఉత్తమ కథలు