టీ20 వరల్డ్‌కప్ 2021 (T20 World Cup 2021) టోర్నీలో టీమిండియా (Team India) ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) విఫలమవ్వడంతో అతనిపై విమర్శలు గుప్పించారు టీమిండియా ఫ్యాన్స్. అయితే, లేటెస్ట్ గా ఈ ఆల్ రౌండర్ తో పాటు మరికొందరు క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. మాఫియా లీడర్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడు భార్య రియాజ్ భాటి భార్య రెహ్ముమా భాటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీలతో బలవంతంగా పడుకోబెట్టేవాడని, రియాజ్ భాటిపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాతో పాటు మాజీ పేసర్ మునాఫ్ పటేల్ పేరు, బీసీసీఐ మాజీ ఛైర్మెన్ రాజీవ్ శుక్లా, పృథ్వీరాజ్ కొథారి వంటి సెలబ్రిటీల పేర్లు ఉండడం విశేషం.
తన భర్త రియాజ్ భాటి, గ్యాంగ్ స్టర్‌గా కావడానికి తన వ్యాపార భాగస్వామ్యులతో పడుకోవాలని తనను ఒత్తిడి చేసేవాడని, అలా కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీల వద్దకు తనను పంపాడని ఫిర్యాదులో వెల్లడించింది రెహ్ముమా భాటి.అయితే రెహ్ముమా ఇచ్చిన ఫిర్యాదులో సరైన అడ్రస్ ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
" నేను పోలీసులను సంప్రదించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నా. అయితే పోలీసులు నా ఫిర్యాదును తీసుకోవడం లేదు. నేను సెప్టెంబర్ నెలలో అప్లికేషన్ ఇచ్చాను. ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయాయి.ఈ రెండు నెలల్లో చాలా మంది పోలీస్ అధికారులను కలిశాను, నా కంప్లైంట్ ఏమైందని అడిగాను. అయితే వాళ్లు మాత్రం డబ్బులు కావాలని అడుగుతున్నారు. నా దగ్గర వారికిచ్చేందుకు డబ్బులు లేవు. ఒకవేళ డబ్బులు ఉన్నా, ఫిర్యాదు చేయడానికి లంచం ఎందుకు ఇవ్వాలి. నా వైపు న్యాయం ఉంది. వాళ్లందరూ క్రిమినల్స్..." అంటూ ఆమె కామెంట్ చేసింది.
COMPLAINT COPY EXCLUSIVE‼️ https://t.co/Nj2U9UoA8P pic.twitter.com/o5uWCoDfLx
— Sameet Thakkar (@thakkar_sameet) November 10, 2021
" భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, మునాఫ్ పటేల్, బీసీసీఐ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా నాపై అత్యాచారం చేశారు. కాంటినెంటల్ హోటల్‌లో మునాఫ్ పటేల్‌తో, ట్రిడెంట్ హోటల్‌లో హార్దిక్ పాండ్యాతో బలవంతంగా ఓ రాత్రి గడిపేలా నన్ను బెదిరించారు. పాండ్యా సహా తన ఇద్దరు స్నేహితులు నాపై అసహజమైన శృంగారం చేశారు. వారు ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నారు. " అంటూ సంచలన ఆరోపణలు చేసింది.
ముంబై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ మంజునాథ్ సింగే, ఆమె అప్లికేషన్ ఇచ్చింది నిజమేనని తెలిపాడు. అయితే ఆమె వద్ద జరిగిన సంఘటన గురించి కానీ, ఫిర్యాదులో పేర్కొన్న వారి గురించి పెద్దగా సమాచారం తెలియదని చెప్పినట్టు తెలిపారు. ఆమె మానసిక పరిస్థితి సరిగానే ఉందా? లేదా? అనే విషయం తేలిన తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదుచేస్తామని తెలియచేశారు. ఇక, న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి హార్ధిక్ పాండ్యాపై వేటు పడింది అతన్ని తప్పించిన సెలక్టర్లు, అతని స్థానంలో యంగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కి అవకాశం ఇచ్చారు. అయ్యర్ క్లిక్ అయితే హార్ధిక్ పాండ్యా కెరీర్ ప్రమాదంలో పడినట్టే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, Hardik Pandya, Team India