విరాట్ సేనను విష్ చేస్తూ మిథాలీరాజ్ ‘థీమ్ సాంగ్’... ట్వీట్ చేసిన సానియా మీర్జా...

మిథాలీరాజ్ నటించిన ‘ఛాంపియన్ యాంథెమ్’ థీమ్ సాంగ్‌ను పోస్ట్ చేసిన సానియా మీర్జా... భారత జట్టుకు ‘ఆల్ ది బెస్ట్’ విషెస్ చెబుతూ అమెరికాన్ టూరిస్టర్‌తో కలిసి స్పెషల్ వీడియో చేసిన మహిళా క్రికెటర్ మిథాలీరాజ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 31, 2019, 2:18 PM IST
విరాట్ సేనను విష్ చేస్తూ మిథాలీరాజ్ ‘థీమ్ సాంగ్’... ట్వీట్ చేసిన సానియా మీర్జా...
విరాట్ సేనను విష్ చేస్తూ మిథాలీరాజ్ ‘థీమ్ సాంగ్’... ట్వీట్ చేసిన సానియా మీర్జా...
  • Share this:
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన వరల్డ్ కప్ సమరం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇంగ్లండ్ వేదికపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో టీమిండియా వన్ ఆఫ్ హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. వన్డేల్లో టాప్-2 ప్లేస్‌లో కొనసాగుతున్న టీమిండియా, టాప్‌లో ఉన్న ఇంగ్లండ్ మధ్యే ఫైనల్ జరుగుతుందని చాలామంది క్రికెట్ విశ్లేషకులు ఫిక్స్ అయిపోయారు కూడా. ఇప్పటికే ఇంగ్లండ్ మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించగా... టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను జూన్ 5న దక్షిణాఫ్రికాతో ఆడబోతోంది. ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్న భారత జట్టుకు ‘ఆల్ ది బెస్ట్’ విషెస్ చెబుతూ ఓ వీడియో షూట్ చేసింది మహిళా క్రికెటర్ మిథాలీరాజ్. అమెరికాన్ టూరిస్టర్ సౌజన్యంతో రూపొందించిన ఈ థీమ్ సాంగ్... క్రికెట్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. భారత జట్టులో క్రికెట్ ఫివర్ ఏ స్థాయిలో ఉందో తెలుపుతూ... ‘మళ్లీ కప్ ఎత్తాలి’ అంటూ సాగిన ఈ వీడియో సాంగ్‌ను ‘ఛాంపియన్ యాంథెమ్’ పేరుతో పోస్ట్ చేసింది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.


మిథాలీరాజ్ నటించిన ‘ఛాంపియన్ యాంథెమ్’ థీమ్ సాంగ్‌ను పోస్ట్ చేసిన సానియా మీర్జా... ‘ఈ సాంగ్ భారత దేశంలో క్రికెట్ క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉందటూ ట్వీట్ చేసింది. భారత జట్టుకు గుడ్ లక్ చెబుతూనే ఈ సాంగ్‌ను షేర్ చేసి ‘బాయ్స్ ఇన్ బ్లూ’కి ఛీర్ చెప్పడంటూ కామెంట్ చేసింది సానియా మీర్జా. భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్... మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
Published by: Ramu Chinthakindhi
First published: May 31, 2019, 2:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading