మూడో టెస్ట్, డే-1: భారత్ 307/6

ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 2-0తో వెనుకబడ్డ భారత్‌.. సిరీస్‌‌పై ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే కచ్చితంగా ఇందులో గెలిచి తీరాలి. కాబట్టి ఈ టెస్టు భారత్‌కు డూ ఆర్ డై లాంటిదనే చెప్పాలి.

news18-telugu
Updated: August 19, 2018, 5:17 PM IST
మూడో టెస్ట్, డే-1: భారత్ 307/6
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య నాటింగ్‌హామ్ ట్రెంట్ బిడ్జ్ వేదికగా మూడో టెస్టు శనివారం ప్రారంభమైంది.టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.మూడో టెస్టు కోసం బరిలో దిగిన భారత తుది జట్టులో కెప్టెన్ కోహ్లి మూడు మార్పులు చేశాడు. ఓపెనర్ మురళీ విజయ్ స్థానంలో శిఖర్ ధావన్‌ను జట్టులోకి తీసుకున్నాడు.

అలాగే దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రాను జట్టులోకి తీసుకున్నాడు. భారత్ తరుపున రిషబ్ పంత్‌కి ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 2-0తో వెనుకబడ్డ భారత్‌.. సిరీస్‌‌పై ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే కచ్చితంగా ఇందులో గెలిచి తీరాలి. కాబట్టి ఈ టెస్టు భారత్‌కు డూ ఆర్ డై లాంటిదనే చెప్పాలి.

డే-1, భారత స్కోరు 307/6:

ఆరంభంలో నిలదొక్కుకున్నట్టే కనిపించిన భారత ఓపెనర్లను ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ ఓక్స్ పెవిలియన్ పంపించాడు. 35 పరుగుల వద్ద శిఖర్ ధావన్‌ను ఔట్ చేసిన ఓక్స్.. ఆ వెంటనే మరో ఓపెనర్ లోకేష్ రాహుల్(23)ను ఔట్ చేశాడు. ఆపై క్రీజులోకి వచ్చిన చటేశ్వర్ పుజారా కూడా ఓక్స్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో 82 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి భారత పీకల్లోతు కష్టాల్లో పడింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి, రహనేతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరు కలిసి స్కోరును 200 దాటించారు. అయితే స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌‌లో రహానే(81) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. ఇక సెంచరీ దిశగా దూసుకుపోతాడనుకున్న కోహ్లి(97) కూడా అదిల్ రషీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్థిక్ పాండ్యా కూడా జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ చేజార్చుకున్నాడు. మొత్తంగా మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్ స్కోరు 307/6గా ఉంది.
Published by: Srinivas Mittapalli
First published: August 18, 2018, 11:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading