WINTER OLYMPICS 2022 OLYMPIANS BURSTS IN TEARS OVER POOR LIVING CONDITIONS LACK OF FOOD AT CHINA WINTER GAMES SRD SJN
Winter Olympics : ప్లీజ్ ఫుడ్ పెట్టండి... చైనా వింటర్ ఒలింపిక్స్‌లో అథ్లెట్ల ఆకలి కేకలు.. మరీ ఇంత దారుణమా..!
Photo Credit : Instagram
Winter Olympics : కరోనా వల్ల డ్రాగన్ కంట్రీ చైనాకు రావాల్సినంత చెడ్డ పేరు కూడా వచ్చింది. తాజాగా మరో విషయంతో చైనా వార్తల్లో నిలిచింది. అదే వింటర్ ఒలింపిక్స్.
చైనా (China) కరోనాపుట్టినిల్లు. రెండేళ్ల క్రితం చైనాలోని వూహాన్లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ (Coronavirus) ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా వల్ల ఆ దేశానికి రావాల్సినంత చెడ్డ పేరు కూడా వచ్చింది. తాజాగా మరో విషయంతో చైనా వార్తల్లో నిలిచింది. అదే వింటర్ ఒలింపిక్స్ (Winter Olympics). ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ చైనాలోని బీజింగ్ (beijing)లో జరుగుతోంది. ఇందులో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి వచ్చిన అథ్లెట్లకు సరిగ్గా ఫుడ్ కూడా పెట్టడం లేదు. ఈ విషయన్ని ప్లేయర్లే స్వయంగా పేర్కొన్నారు. అంతేకాకుండా గేమ్స్ కోసం వచ్చి కరోనా బారిన పడ్డ వారి పరిస్థతి అయితే మరీ దారుణంగా ఉంది. అక్కడ చైనా ప్రభుత్వంవిధించిన కోవిడ్-19 (Covid-19) ప్రొటోకాల్స్‌తో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ కంటతడి కూడా పెడుతున్నారు.
వివరాల్లోకి వెళితే... వింటర్ ఒలింపిక్స్ కోసం నిర్మించిన విలేజ్‌లో క్యాటరింగ్ సదుపాయమే సరిగ్గా లేదని జర్మనీ టీమ్ స్కీయింగ్ కోచ్ స్వెగర్ నిర్వాహకులపై విమర్శలు చేశాడు. గేమ్స్‌లో పాల్గొనాలంటే అథ్లెట్లకు శక్తి కావాలని... అయితే అలా శక్తినిచ్చే ఫుడ్స్ ఒక్కటి కూడా భోజనశాలలో దొరకడం లేదంటూ ఆయన వాపోయాడు. కొన్ని చాక్లెట్స్, గింజలు తప్ప తినడానికి అక్కడ ఏమీ లేవంటూ ఆయన పేర్కొన్నాడు.
ఇక రష్యాకు చెందిన వలేరియా వస్నెస్తోవా (Valeria Vasnetsova) అనే అథ్లెట్ క్వారంటైన్లో తనకు ఎదురైన చేదు ఘటనలను గురించి ఈ విధంగా వివరించింది. " గేమ్స్ కోసం బీజింగ్‌లో అడుగుపెట్టగానే నన్ను క్వారంటైన్లో ఉంచారు. ఐదు రోజులుగా టేస్ట్లేని ఒకే రకమైన ఫుడ్‌ను పెడుతున్నారు. అందులో ప్రొటీన్ అసలే లేదు. నేను బక్క చిక్కిపోయాను. శరీరంలో ఎముకలు బయటకు కన్పిస్తున్నాయి. ఆకలితో శక్తి లేకుండా పోయి... రోజంతా అలా బెడ్‌పై పడుకునే ఉంటున్నా" అంటూ క్వారంటైన్లో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఆమె ఇన్‌స్టాలో పేర్కొంది. అయితే కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడం గమనార్హం.
ఇక కరోనా పాజిటివ్‌గా తేలిన వారి పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక వీడియోను బెల్జియం స్కెల్టన్ రేసన్ కిమ్ మెలెమన్స్ (Kim Meylemans) తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
అందులో ఆమె తాను కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఐసోలేషన్‌లో ఉంచారని... అయితే అనంతరం తనకు చేసిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టు వచ్చినట్లు పేర్కొంది. దాంతో తనను గేమ్స్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తారని భావించానని... అయితే నిర్వాహకులు తనను అంబులెన్స్‌లో మరో చోటుకి తీసుకెళ్లి ఉంచినట్లు ఆమె పేర్కొంది. అంతేకాకుండా తాను ప్రస్తుతం ఎక్కడ ఉన్నానో కూడా తెలీదంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. కరోనా పాజిటివ్‌గా తేలిన చాలా మంది అథ్లెట్ల పరస్థితి తనలానే ఉన్నట్లు కిమ్ మెలెమన్స్ పేర్కొంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.