Abhinandan Pakistani Ad: వింగ్ కమాండర్ అభినందన్ పై పాకిస్థాన్ దిగజారుడు టీవీ యాడ్..

Abhinandan Pakistani Ad | కమాండర్ అభినందన్ పోలికలతో ఉన్నవ్యక్తి భారత జట్టు జెర్సీ ధరించి టీ తాగుతూ కనిపిస్తుంటాడు. అతడిని విచారణాధికారులు ప్రశ్నిస్తున్నట్లు చూపించారు. అయితే చివరగా టీ కప్ ను అభినందన్ పాత్రధారి చేతిలోంచి లాక్కున్నట్లు చూపించి...వరల్డ్ కప్ పాకిస్థాన్ కైవసం చేసుకుంటుందన్నట్లు సింబాలిక్ గా చూపించారు.

news18-telugu
Updated: June 11, 2019, 11:19 PM IST
Abhinandan Pakistani Ad: వింగ్ కమాండర్ అభినందన్ పై పాకిస్థాన్ దిగజారుడు టీవీ యాడ్..
( Image : twitter)
news18-telugu
Updated: June 11, 2019, 11:19 PM IST
Abhinandan Pakistani Ad | ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 16 భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్ మీడియా మాత్రం దిగజారిన పబ్లిసిటీకి తెరలేపింది. ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓ పాకిస్థాన్ టీవీ చానల్ చేసిన యాడ్ తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఈ యాడ్‌పై సోషల్ మీడియాలో భారతీయులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యాడ్ ఫిల్మ్ లో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను హేళన చేస్తూ చూపించడమే భారతీయలకు ఆగ్రహం తెప్పిస్తోంది. 30 సెకన్లపాటు నిడివి ఈ వీడియోను పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ రూపొందించింది. ప్రసుత్తం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమాండర్ అభినందన్ పోలికలతో ఉన్నవ్యక్తి భారత జట్టు జెర్సీ ధరించి టీ తాగుతూ కనిపిస్తుంటాడు. అతడిని విచారణాధికారులు ప్రశ్నిస్తున్నట్లు చూపించారు. అయితే చివరగా టీ కప్ ను అభినందన్ పాత్రధారి చేతిలోంచి లాక్కున్నట్లు చూపించి...వరల్డ్ కప్ పాకిస్థాన్ కైవసం చేసుకుంటుందన్నట్లు సింబాలిక్ గా చూపించారు.



First published: June 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...