Home /News /sports /

WINDIES CRICKETER ANDRE FLETCHER DELIVERS SOME FACINATING HITTING AND HE SMACKS 16 RUNS OFF JUST 3 BALLS WATCH SRD

Viral Video : ఈ బాదుడు మీ విండీస్ క్రికెటర్లకే సాధ్యం సామీ.. టెన్షన్ లో కూడా అద్భుతం చేశాడు..

Image Credit : Twitter

Image Credit : Twitter

Viral Video : 3 బంతుల్లో 16 పరుగులు.. ఈ గణాంకాలు చూస్తే ఎవరైనా సరే బౌలింగ్ టీమే దాదాపు గెలుస్తోందని అనుకుంటారు. ప్రతీ బంతిని స్టాండ్స్ లోకి పంపితే కానీ ఇది సాధ్యం కాదు. దీంతో.. బౌలింగ్ టీమ్ వైపే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయ్.

    క్రికెట్ (Cricket News) అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 (T20 Cricket) వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాసాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉన్నాయ్. ఇక, లేటెస్ట్ గా టీ10 ఫార్మాట్ కూడా ఇచ్చింది. ఇక, ఇందులో బ్యాటర్ల విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫటాఫట్ గేమ్ లో రఫ్ఫాడిస్తున్నారు. సాధారణంగా.. 3 బంతుల్లో 16 పరుగులు.. ఈ గణాంకాలు చూస్తే ఎవరైనా సరే బౌలింగ్ టీమే దాదాపు గెలుస్తోందని అనుకుంటారు. ప్రతీ బంతిని స్టాండ్స్ లోకి పంపితే కానీ ఇది సాధ్యం కాదు. దీంతో.. బౌలింగ్ టీమ్ వైపే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయ్. కానీ, విండీస్ బ్యాటర్లు ముందు ఎలాంటి గణాంకాలైనా మారిపోవాల్సిందేనని మరోసారి నిరూపితమైంది. 3 బంతుల్లో 16 పరుగుల్ని సాధించి ఔరా అన్పించాడు విండీస్ డేంజరస్ బ్యాటర్ ఆండ్రీ ఫ్లెచర్ (Andre Fletcher).

    వివరాల్లోకెళితే.. విన్సీ ప్రీమియర్‌ లీగ్‌ 2022లో భాగంగా బొటానికల్‌ గార్డెన్స్‌ రేంజర్స్‌, ఫోర్ట్‌ చార్లెట్‌ స్ట్రైకర్స్‌ మధ్య టి10 మ్యాచ్‌ జరిగింది. నరాల తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బొటానికల్‌ గార్డెన్స్‌ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫోర్ట్‌ చార్లెట్‌ స్ట్రైకర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 107 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన బొటానికల్‌ గార్డెన్స్‌కు ఆఖరి ఓవర్‌లో విజయానికి 21 పరుగులు అవసరం అయ్యాయి.

    ఇది కూడా చదవండి : ఐపీఎల్ లక్ష్యంగా ఉగ్రదాడికి ప్లాన్.. ఆందోళనలో బీసీసీఐ, ఆటగాళ్లు..!

    కొర్టోన్‌ లావియా ఆఖరి ఓవర్‌ వేయగా.. క్రీజులో ఫ్లెచర్‌ ఉన్నాడు. అప్పటికే 27 బంతుల్లో 39 పరుగులతో ఆడుతున్నాడు. మొదటి బంతికి ఎలాంటి పరుగు రాలేదు. రెండో బంతికి లెగ్‌బైస్‌, నో బాల్‌ రూపంలో బౌండరీతో పాటు ఒక రన్‌ అదనంగా వచ్చింది. మరుసటి రెండు బంతులు డాట్‌ బాల్స్‌. దీంతో చివరి మూడు బంతుల్లో 16 పరుగులు కావాలి. లావియా వేసిన ఫుల్‌టాస్‌ను స్వ్కేర్‌ లెగ్‌ దిశగా భారీ సిక్సర్‌ సంధించాడు.


    ఆ మరుసటి బంతిని మిడ్‌వికెట్‌ మీదుగా కళ్లు చెదిరే బౌండరీ బాదాడు. అంతే ఆఖరి బంతికి సిక్స్‌ కొడితే ఫ్లెచర్‌ జట్టు విజయాన్ని అందుకుంటుంది. అలా చివరి బంతి వేయగానే ఫ్లెచర్‌ స్ట్రెయిట్‌ సిక్స్‌ను సంధించాడు. ఫ్లెచర్‌ 34 బంతుల్లో మెరుపు అర్థశతకంతో పాటు జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ఫ్లెచర్‌పై సహచరులు అభినందనల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బాదుడు మీ విండీస్ క్రికెటర్లకే సాధ్యమంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Viral Video, West Indies

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు