హోమ్ /వార్తలు /క్రీడలు /

Wimbledon 2021 : బాయ్స్ సింగిల్ టైటిల్ విన్నర్ గా సమీర్ బెనర్జీ.. భవిష్యత్తు అతనిదే అంటూ..

Wimbledon 2021 : బాయ్స్ సింగిల్ టైటిల్ విన్నర్ గా సమీర్ బెనర్జీ.. భవిష్యత్తు అతనిదే అంటూ..

Photo Credit : twitter

Photo Credit : twitter

Wimbledon 2021 : వింబుల్డన్‌ 2021లో ఇండో అమెరికన్‌ సమీర్‌ బెనర్జీ సంచలనం సృష్టించాడు. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో జరిగిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో పోటీ పడ్డ సమీర్‌ బెనర్జీ (17) ఫైనల్ లో అమెరికాకు చెందిన విక్టర్‌ లిలోవ్‌పై 7-5, 6-3 తేడాతో విజయం సాధించాడు.

ఇంకా చదవండి ...

  వింబుల్డన్‌ 2021లో ఇండో అమెరికన్‌ సమీర్‌ బెనర్జీ సంచలనం సృష్టించాడు. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో జరిగిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో పోటీ పడ్డ సమీర్‌ బెనర్జీ (17) ఫైనల్ లో అమెరికాకు చెందిన విక్టర్‌ లిలోవ్‌పై 7-5, 6-3 తేడాతో విజయం సాధించాడు. జూనియర్‌ గ్రాండ్‌స్లామ్‌లో పోటీ పడ్డ రెండోసారే సమీర్‌.. ఈ ఘనత సాధించాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి విశేషంగా ఆకట్టుకుంటూ టైటిల్‌ను కైవసం చేసుకున్న సమీర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. రానున్న కాలంలో పురుషుల టెన్నిస్‌ను ఏలుతాడంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురుస్తోంది.ఒకే ఈవెంట్‌లో ఇద్దరు అమెరికన్ బాయ్స్ తలపడడం 2014 తర్వాత ఇదే తొలిసారి కాగా, 1977 తర్వాత ఇది రెండోసారి. సమీర్, విక్టర్ ఇద్దరూ అన్‌సీడెడ్ ఆటగాళ్లు కావడం గమనార్హం.

  ఇక, గాళ్స్ సింగిల్స్ ఫైనల్‌లో జర్మనీకి చెందిన నాస్టాస్జా మరియానా షంక్ స్పెయిన్‌కు చెందిన అనే మింటెగీ డెల్ ఓల్మోతో తలపడనుంది. 17 ఏళ్ల వీరిద్దరు కూడా అన్‌సీడెడ్ ఆటగాళ్లే. మహిళల సింగిల్స్‌లో స్పెయిన్ విజయం సాధించింది. అయితే, భారత్‌కు చెందిన యూకీ బాంబ్రీ జూనియర్‌ విభాగంలో చివరిసారిగా 2009 ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ను గెలిచాడు. అంతకుముందు లియాండర్‌ పేస్‌ (1990 వింబుల్డన్‌), రమేష్‌ కృష్ణన్‌ (1979 ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌), రామనాథన్‌ కృష్ణన్‌ (1954 వింబుల్డన్‌) జూనియర్‌ విభాగంలో గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను చేజిక్కించుకున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Tennis, Wimbledon

  ఉత్తమ కథలు