బీజేపీలోకి గంగూలీ.. ఫ్యూచర్ సీఎం అభ్యర్థి..?

గంగూలీ వాదన అలా ఉన్నప్పటికీ.. ఈ నెల 12న ఆయన అమిత్ షాతో భేటీ కావడం రాజకీయ చర్చకు ఊతమిచ్చింది. గంగూలీ బీజేపీలో చేరాలనుకుంటున్నారు కాబట్టే అమిత్ షాతో భేటీ అయ్యారన్న వాదన వినిపిస్తోంది.

news18-telugu
Updated: October 16, 2019, 7:29 AM IST
బీజేపీలోకి గంగూలీ.. ఫ్యూచర్ సీఎం అభ్యర్థి..?
గంగూలీ (File)
news18-telugu
Updated: October 16, 2019, 7:29 AM IST
టీమిండియాకు దూకుడు నేర్పిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీకి చెరిగిపోని ముద్ర ఉంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీ.. ఇక్కడ కూడా తన మార్క్ చూపిస్తారని అంతా భావిస్తున్నారు. అయితే గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులవడం వెనుక బీజేపీ మార్క్ స్ట్రాటజీ ఉందన్న చర్చ జరుగుతోంది. 2021లో బీజేపీ తరుపున పశ్చిమ బెంగాల్ సీఎం అభ్యర్థిగా దాదాను బరిలో దించాలని బీజేపీ భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే ఆయన్ను బీసీసీఐ అధ్యక్ష పదవికి ప్రమోట్ చేశారనే ప్రచారం జోరందుకుంది.అయితే గంగూలీ మాత్రం తన ఫోకస్ మొత్తం ఆట పైనే తప్ప రాజకీయాలపై పట్టింపు లేదని స్పష్టం చేశారు. గతంలో తాను సీఎం మమతా బెనర్జీని కలిసినప్పుడు కూడా ఇలాంటి ఊహాగానాలే వినిపించాయని గుర్తుచేశారు.

గంగూలీ వాదన అలా ఉన్నప్పటికీ.. ఈ నెల 12న ఆయన అమిత్ షాతో భేటీ కావడం రాజకీయ చర్చకు ఊతమిచ్చింది. గంగూలీ బీజేపీలో
చేరాలనుకుంటున్నారు కాబట్టే అమిత్ షాతో భేటీ అయ్యారన్న వాదన వినిపిస్తోంది. గంగూలీని బీసీసీఐ అధ్యక్షుడిగా చేయడం ద్వారా అక్కడి ప్రజల మనసు గెలుచుకోవచ్చని బీజేపీ అంచనా వేసినట్టు సమాచారం. ఈ లెక్కలతోనే 2021లో గంగూలీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే యోచనలో బీజేపీ ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి.. ఇదంతా ఊహాగానాలకే పరిమితమవుతుందో.. లేక నిజంగానే బీజేపీ ఈ స్ట్రాటజీని అమలుచేస్తుందో..!

First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...