WILL ROHIT SHARMA THE NEW INDIAN ODI T20 TEAM CAPTAIN GET MORE SALARY THAN VIRAT KOHLI JNK
Rohit Sharma Salary: వన్డే, టీ20ల కెప్టెన్ రోహిత్ శర్మకు జీతం పెరుగుతుందా? బీసీసీఐ అతడికి ఎంత ఇస్తుంది?
కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంత జీతం అందుకోబోతున్నాడు? (PC: BCCI)
Rohit Sharma Salary: టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టాడు. అయితే కొత్త బాధ్యతల కారణంగా రోహిత్‌కు జీతం పెరుగుతుందా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి బీసీసీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఒక సారి పరిశీలిద్దాం.
టీమ్ ఇండియాకు (Team India) తొలి సారిగా ఇద్దరు కెప్టెన్లను నియమిస్తూ బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నది. టెస్టులకు విరాట్ కోహ్లీని (Virat Kohli) కొనసాగిస్తుండగా.. వన్డే, టీ20లకు రోహిత్ శర్మను (Rohit Sharma) కెప్టెన్‌గా నియయిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. కాగా, మొన్నటి వరకు సాధారణ క్రికెటర్‌గా ఉన్న రోహిత్ శర్మ ఇప్పుడు కెప్టెన్ అవడంతో ఎంత జీతం అందుకుంటాడని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. విరాట్ కోహ్లీ జీతం కంటే రోహిత్ ఎక్కువ శాలరీ అందుకుంటాడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్లు, ఆటగాళ్ల జీతభత్యాల విషయంలో బీసీసీఐ నిబంధనలు ఎలా ఉన్నయో పరిశీలిస్తే.. రోహిత్, కోహ్లీల జీతాలు ఎంతో మనం తెలుసుకోవచ్చు. బీసీసీఐ ప్లేయర్ కాంట్రాక్టుల్లో గ్రేడ్లుగా విభజించి జీతాలు ఇస్తున్నది. అవి ఎలా ఉన్నాయో ఒక సారి మనం చూద్దాము.
బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో ఏ+ గ్రేడులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు. ఈ గ్రేడ్‌లో ఉన్న వారికి ఏడాదికి రూ. 7 కోట్ల మేర జీతం వస్తుంది. రోహిత్‌కు కూడా అదే మొత్తంలో జీతం అందుతున్నది. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినా.. వారికి ప్రత్యేకంగా జీతాలు ఏమీ పెరగవు. అంటే రోహిత్, కోహ్లీకి తమ గ్రేడ్ ప్రకారమే జీతం అందుకుంటారు తప్ప కెప్టెన్లుగా ఉన్నందుకు జీతం ఏమీ ఉండదు. అయితే తుది జట్టు, టాస్ వంటి కీలక నిర్ణయాలు కెప్టెన్ తీసుకుంటాడు. ఇక బీసీసీఐ ఏ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 3 కోట్లు.. సి గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ. 1 కోటి మేర జీతం అందుతుంది.
ఐపీఎల్లో మాత్రం కోహ్లీ కంటే రోహిత్ శర్మకే జీతం ఎక్కువ. గత సీజన్లో రోహిత్ శర్మ రూ. 15 కోట్లు, కోహ్లీ రూ. 17 కోట్లు అందుకున్నాడు. అయితే ఐపీఎల్ 2022 రిటెన్షన్ పాలసీ ప్రకారం ముంబై జట్టు రోహిత్ శర్మను తొలి ప్రాధాన్యపు ఆటగాడిగా తీసుకోవడంతో ఈ సారి రూ. 16 కోట్లు జీతంగా తీసుకోనున్నాడు. అయితే ఆర్సీబీ జట్టు తొలి ప్రాధాన్యపు ఆటగాడిగా విరాట్ కోహ్లీని తీసుకోవడంతో అతడి జీతం రూ. 15 కోట్లకు చేరింది. గతంలో ఉన్న రూ. 17 కోట్ల కంటే రూ. 2 కోట్లు తక్కువగానే తీసుకోబోతున్నాడు. ఇక మొత్తం ఐపీఎల్లో రోహిత్ శర్మ రూ. 146.6 కోట్లు సంపాదించగా.. విరాట్ కోహ్లీ రూ. 143 కోట్లు సంపాదించాడు. అయితే ఐపీఎల్లో అత్యధికంగా సంపాదించింది మహేంద్ర సింగ్ ధోనీనే. అతడు రూ. 150 కోట్లు సంపాదించాడు.
రోహిత్ శర్మ ఇప్పటి వరకు 6 సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాడు. 2009లో డెక్కన్ చార్జర్స్ ఆటగాడిగా తొలి సారి ఐపీఎల్ ట్రోఫీ సాధించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా 5 సార్లు చాంపియన్ అయ్యాడు. 2013, 2015, 2017. 2019, 2020లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచాడు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.