Home /News /sports /

PV Sindhu: నేటి నుంచే బీబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌.. పీవీ సింధు టైటిల్ నిలబెట్టుకుంటుందా?

PV Sindhu: నేటి నుంచే బీబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌.. పీవీ సింధు టైటిల్ నిలబెట్టుకుంటుందా?

వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పీవీ సింధుకు కఠినమైన డ్రా

వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పీవీ సింధుకు కఠినమైన డ్రా

PV sindhu: ప్రస్తుతం బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ అయిన పీవీ సింధుకు కఠినమైన పరీక్ష ఎదురు కాబోతున్నది. స్పెయిన్ వేదికగా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్ నేటి నుంచి ప్రారంభం కానున్నది. డిఫెండింగ్ చాంపియన్ అయిన సింధు ఆ టైటిల్ నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉన్నది.

ఇంకా చదవండి ...
    భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ (Badminton Player) పీవీ సింధుకు (PV sindhu) నేటి నుంచి కఠినమైన పరీక్ష ఎదురు కాబోతున్నది. స్పెయిన్ వేదికగా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్  (BWF World Championships) ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం వరల్డ్ చాంపియన్ అయిన పీవీ సింధు ఈ టైటిల్ నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉన్నది. ఈ ఏడాది సింధు సరైన ఫామ్‌లో లేదు. కీలకమైన టోర్నీల్లో చివరి వరకు వచ్చి సెమీస్ లేదా ఫైనల్‌లో ఓడిపోవడం రివాజుగా మారింది. 2019లో ప్రపంచ చాంపియన్‌షిప్స్ గెలిచి పీవీ సింధు చరిత్ర సృష్టించింది. వరల్డ్ చాంపియన్‌ అయిన తొలి భారత మహిళా షట్లర్‌గా రికార్డులకు ఎక్కింది. కరోనా (Corona) కారణంగా 2020 వరల్డ్ చాంపియన్‌షిప్‌ను రద్దు చేశారు. దీంతో సింధు టైటిల్‌కు ఎలాంటి ముప్పు కలుగలేదు. అయితే డిసెంబర్ 12 నుంచి స్పెయిన్‌లో జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న పీవీ సింధు టైటిల్ నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉన్నది.

    డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధుకు ఈ సారి కఠినమైన డ్రా ఎదురైంది. తొలి రౌండ్‌లో ఆమెకు బై లభించింది. ఇక రెండో రౌండ్‌లో మార్టీనా రెపిస్కా, రూసెల్లీ హర్తవాన్‌లో ఒకరితో తలపడాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత నుంచి సింధు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మూడో రౌండ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న థాయిలాండ్ షట్లర్ చూచువాంగ్‌ను ఎదుర్కోవల్సి రావచ్చు. ఆమెను ఓడిస్తే క్వార్టర్ ఫైనల్‌లో వరల్డ్ నెంబర్ 1 తైజూ యింగ్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

    HBD Yuvraj Singh: నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్.. క్యాన్సర్ జయించిన వీరుడు.. కానీ ఒక విషయంలో అరెస్టు అయ్యాడు


    ఇక ఆ తర్వాత సెమీస్‌లో కరొలినా మారిన్‌తో మ్యాచ్ జరగాల్సి ఉన్నది. పీవీ సింధు మూడో రౌండ్ నుంచే హేమాహేమీలతో తలపడాల్సి ఉన్నది. అయితే కొన్ని నెలలుగా బ్యాడ్మింటన్‌కు దూరంగా ఉన్న కరోలినా మారిన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఆడటం లేదని స్పష్టం చేసింది. సొంత నగరంలో ఈ టోర్నీ జరుగుతుండటంతో మారిన్‌కు తప్పకుండా కలసి వస్తుందని అందరూ భావించారు. కానీ మోకాలి గాయం తగ్గకపోవడంతో మెగా టోర్నీ నుంచి తప్పుకున్నది. టోక్యో ఒలింపిక్స్‌కు కూడా గాయం కారణంగా మారిన్ దూరమైంది. మారిన్ లేకపోవడం సింధుకు కలసి వచ్చే అవకాశం ఉన్నది.

    PKL 8: ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 మొత్తం జరిగేది ఇక్కడే.. ఈ లగ్జరీ హోటల్, కన్వెన్షన్ సెంటర్ చూశారా?




    పీవీ సింధు ఈ ఏడాది సరైన ఫామ్‌లో లేదు. కీలక మ్యాచ్‌లలో ఓటములు కొనితెచ్చుకున్నది. ఈ ఏడాది మొదట్లో స్విస్ ఓపెన్ ఫైనల్ చేరింది. కానీ ఆ మ్యాచ్‌లో కరొలినా మారిన్‌పై 12-21, 5-21 తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఇక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో చూచువాంగ్ చేతిలో 17-21, 9-21 తేడాతో ఓటమిపాలయ్యింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన పీవీ సింధు సెమీఫైనల్‌లో తైజు యింగ్ చేతిలో ఓడిపోయింది.

    Cricket in Olympics: ఒలింపిక్స్ 2028 జాబితా నుంచి క్రికెట్ ఔట్.. నిరుత్సాహపడొద్దు.. క్రికెట్ ఎంట్రీ ఖాయం అంటున్న ఐసీసీ




     అయితే చైనా క్రీడాకారిణి హి బిగ్జియావోపై గెలిచి కాంస్య పతకం సాధించింది. ఇక ఆ తర్వాత మలేషియా ఓపెన్, ఇండోనేషియా మాస్టర్స్, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఓటములే ఎదురయ్యాయి. ఈ ఏడాది చివరి టోర్నీ కావడంతో గెలుపుతో ముగించడమే కాకుండా టైటిల్ కూడా నిలబెట్టుకోవాలని పీసీ సింధు భావిస్తున్నది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Badminton, Pv sindhu

    తదుపరి వార్తలు